Begin typing your search above and press return to search.

రోజా విప్పిన ట్రాక్ రికార్డు విన్నారా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 9:22 AM GMT
రోజా విప్పిన ట్రాక్ రికార్డు విన్నారా?
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ నేత‌ల‌పై వైసీపీ మ‌హిళా నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నేటి ఉద‌యం గుప్పించిన విమ‌ర్శల‌పై పెద్ద చ‌ర్చ‌కే తెర లేచేలానే ఉంది. ఎందుకంటే... త‌న‌ను మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుకు ర‌మ్మ‌ని ఆహ్వానించి - ఆ త‌ర్వాత చ‌ట్ట విరుద్దంగా త‌న‌ను అడ్డుకున్న తీరుపై పోలీసులు - ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లపై గ‌న్న‌వ‌రం కోర్టులో పిటిష‌న్ వేసేందుకు నేటి ఉద‌యం విజ‌య‌వాడ వ‌చ్చిన రోజా... అంత‌కుముందు అక్క‌డే మీడియాతో మాట్లాడిన సంద‌ర్బంగా టీడీపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళా పార్ల‌మెంటులో తానేదో చేస్తాన‌నే భ‌యంతోనే పోలీసులు త‌న‌ను అడ్డుకున్నార‌ని చెప్పిన రోజా... అస‌లు త‌న‌ను వేదిక వ‌ద్ద‌కు రాకుండానే అడ్డుకున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా రోజా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి నేప‌థ్యంలో... మ‌హిళా పార్ల‌మెంటులోనూ ఆమె ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌టం ఖాయ‌మ‌న్న స‌మాచారంతోనే ప్ర‌భుత్వ ఆదేశాల‌తోనే పోలీసులు రోజాను అడ్డుకున్నారు. ఇదే విష‌యాన్ని ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు స్వ‌యంగా మీడియా ముందు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఎమ్మెల్యేగా రోజా ట్రాక్ రికార్డును ప‌రిశీలించిన మీద‌టే... మ‌హిళా పార్ల‌మెంటుకు ఆమెను అనుమ‌తించ‌రాద‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెప్పుకొచ్చారు. మీడియా సాక్షిగా డీజీపీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకుని నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌లో ఓ రేంజిలో ఫైర‌య్యారు. అస‌లు డీజీపీకి ఎవ‌రి ట్రాక్ రికార్డు ఎలా ఉందో తెలుసా అంటూ రోజా ప్ర‌శ్నించారు. చ‌ట్ట విరుద్ధ కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవాల్సిన డీజీపీ క‌నుస‌న్న‌ల్లోనే త‌న‌పై దౌర్జ‌న్యం జ‌ర‌గ‌డం దారుణ‌మ‌ని, అంత‌కంటే బాధాక‌ర‌మైన విష‌యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆమె అన్నారు. చంద్రబాబుకు బానిసలా డీజీపీ పనిచేయడం దురదృష్టకరమ‌న్నారు.

డీజీపీ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో విలన్‌ గా ఉండిపోయే అవకాశముంద‌ని హెచ్చ‌రించారు. నా ట్రాక్‌ రికార్డు చూసి నిర్బంధించమని చెప్పానని చంద్రబాబు అంటున్నారు. పదేళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ట్రాక్‌ రికార్డు గుర్తుకురాలేదా? ఏదైనా ప్రభుత్వాలు కూల్చిన ట్రాక్ రికార్డు ఉందా? నా ఇంట్లో బాంబులు పేలిన ట్రాక్‌ రికార్డు ఉందా? ఇంట్లోని వారిపై కాల్పులు జరిపిన ట్రాక్‌ రికార్డు ఉందా? ఏ ట్రాక్‌ రికార్డు చూసి నన్ను నిర్బంధించమని డీజీపీకి చెప్పారు అని రోజా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మరి ఈ ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు గాని, లేదంటే మ‌హిళా పార్ల‌మెంటుకు అన్నీ తానే వ్య‌వ‌హ‌రించిన స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ గాని ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/