Begin typing your search above and press return to search.
పవన్ మీద రోజా విమర్శలు
By: Tupaki Desk | 26 Aug 2015 9:16 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కానీ.. మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో ఒంటికాలి మీద విరుచుకుపడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఏదైనా వ్యాఖ్య చేయాల్సి వస్తే.. తొందరపడరు. అలాంటి రోజా తాజాగా పవన్ మీద విమర్శలు చేశారు.
ఒక పత్రికలో వచ్చిన కథనానికి స్పందనగా మాట్లాడిన రోజా.. ఎల్లో మీడియా అని తిట్టేసి.. విషయంలోకి పవన్ ను తీసుకురావటం గమనార్హం. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్.. భూసేకరణ అంశం మీద పవన్ కల్యాణ్ దూసుకెళుతుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మాత్రం వెనుకపడ్డారంటూ వచ్చిన విమర్శపై స్పందించిన రోజా.. పవన్ పై విమర్శలు చేశారు.
రాష్ట్రంలోని వివిధ అంశాలపై పవన్ ఏ రోజూ మాట్లాడింది లేదని.. తమ అధినేత జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రతి అంశం మీద మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అనంతపురంలో రైతుల ఆత్మహత్య విషయంలో కానీ.. ఎమ్మార్వో వనజాక్షి పై జరిగిన దాడి కావొచ్చు.. ఇలా ఏ అంశం మీదా పవన్ స్పందించలేదని.. కానీ.. జగన్ మాత్రం ఈ అంశాల మీద పోరాడారంటూ పొగిడేశారు.
ఓపక్క తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. తాను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పదే పదే పవన్ చెప్పుకుంటున్నా.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో పవన్ ను పోల్చుకోవటం ఎందుకు?
విపక్ష నేతగా జగన్ కు బాధ్యతలు ఎక్కువ. కానీ.. పవన్ ఎలాంటి రాజకీయ పదవి లేకున్నా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారన్న విషయాన్ని మర్చిపోయి మరీ.. రోజా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ విషయంలో విమర్శలు చేసేటప్పుడు దూకుడు కన్నా కూడా దూరదృష్టితో ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో.