Begin typing your search above and press return to search.

రోజా కేసుతో పోలీసులకు చిక్కొచ్చింది

By:  Tupaki Desk   |   18 May 2017 8:00 AM GMT
రోజా కేసుతో పోలీసులకు చిక్కొచ్చింది
X
టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమవుతున్న కామెడీ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాపై నమోదైన కేసు విషయంలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలా అన్న విషయంలో ఏకంగా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.

జబర్దస్త్ - పటాస్ అనే కామెడీ షోలలో పలు స్కిట్లు అభ్యంతరకరంగా ఉంటున్నాయని... అందులోని సన్నివేశాలు - డైలాగులు అసభ్యంగా ఉంటున్నాయని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఒకరు హైదరాబాద్ లోని బాలానగర్ పోలీసు స్టేషన్లో కేసు వేశారు. ఇందులో జబర్దస్త్ షోకు రోజా జడ్జిగా ఉన్నారు. రోజా ఎమ్మెల్యే హోదాలో ఉంటూ ఇలా అశ్లీల డైలాగులు - సన్నివేశాలున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ వేసిన ఆ కేసును పోలీసులు స్వీకరించారు.

అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తరువాతే పోలీసులకు అసలు సమస్య మొదలైంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అసలు ఏఏ ఎపిసోడ్లు అలా ఉన్నాయి, ఎందులో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి వంటి వివరాలేవీ ఫిర్యాదుదారు ఇవ్వకపోవడంతో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా ఏపీకి చెందిన ఎమ్మెల్యేపై పడిన కేసు కావడంతో ఎందుకైనా మంచిదని పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. ఒకవేళ ఆధారాలు దొరికితే తమ పై అధికారులతో సంప్రదించి ఏం చేయాలో ఆలోచిస్తామని బాలానగర్ పోలీసులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/