Begin typing your search above and press return to search.
మద్యం విమర్శలపై టీడీపీ నాయకులను ఏకేసిన రోజా
By: Tupaki Desk | 4 May 2020 7:16 PM ISTకేంద్రం ఇచ్చిన సడలింపులతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభానికి ముందే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 20 శాతం ధరలు పెంచుతూ నిర్ణయించింది. ఇక సోమవారం నుంచి మద్యం విక్రయాలు మొదలయ్యాయి. ధరలు పెంచినా ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా మద్యం కోసం ఎగబడ్డారు. అయితే ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు. మద్యపానం నిషేధం విధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచడంతో పాటు మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ నాయకులు విమర్శల దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఐసీసీ చైర్‌పర్సన్, ఫైర్‌బ్రాండ్ రోజా స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మద్యపాన నిషేధంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరలు పెంచారని తెలిపారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారనే భావనతో పెంచినట్లు పేర్కొన్నారు. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. మద్యాన్ని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏరులై పారిస్తే నోరుమెదపని నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. హామీ ఇచ్చిన మాదిరి సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు.