Begin typing your search above and press return to search.
దద్దమ్మ.. ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటాడు.. రోజా తిట్టింది ఎవరినంటే?
By: Tupaki Desk | 28 Jun 2020 10:50 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రత్యర్థులపై ఆమె చేసే వ్యాఖ్యల ఘాటు దిమ్మ తిరిగేలా ఉంటుంది. అందునా.. విపక్ష నేత చంద్రబాబు కానీ.. ఆయన కుమారుడు లోకేశ్ మీద విమర్శలు చేయటానికి మహా ఉత్సాహాన్ని ప్రదర్శించే ఆమె.. వారి ప్రస్తావన వస్తే చాలు శివాలెత్తిపోతారు. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చిన ఆమె.. తండ్రి కొడుకుల మీద నిప్పులు చెరిగారు.
విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి.. కొడుకులు ఇద్దరూ దొంగల్లా హైదరాబాద్ కు పారిపోయి తలదాచుకున్నారన్నారు. చంద్రబాబుకు.. లోకేశ్ కు కేవలం అధికారం.. డబ్బు మాత్రమే కావాలని.. ప్రజలపై వారికి ఎలాంటి అభిమానం లేదన్నారు. ఇంట్లో కూర్చొని పని పాటా లేకుండా పబ్జి గేమ్ ఆడుకునే లోకేశ్ కు.. సీఎం జగన్ కు పోలిక లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టే నాటికి రూ.3లక్షల కోట్ల అప్పును బాబు తన పాలనతో ఇచ్చినా.. సీఎం జగన్ సమర్థవంతంగా పాలన చేస్తున్నారన్నారు. వైరస్ కట్టడి కోసం ఎక్కువమందికి పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిపారన్నారు. మొత్తంగా చూస్తే.. లోకేశ్ ను నేరుగా టార్గెట్ చేసిన రోజా మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
విపక్ష నేత చంద్రబాబు కంటే కూడా లోకేశ్ మీదే ఎక్కువగా ఆమె గురి పెట్టారు. ఇటీవల కాలంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్టర్ లో పంచ్ లు వేస్తున్న లోకశ్ పై ఆమె ఘాటుగా స్పందించారు. లోకేశ్ ఇంట్లో తిని కూర్చొని.. ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయటం చాలా బాధాకరమన్న ఆమె.. ముఖ్యమంత్రి కొడుకుగా.. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు.