Begin typing your search above and press return to search.
బికినీ షోలకు ఓకే.. మౌన ప్రదర్శనకు నో?
By: Tupaki Desk | 26 Jan 2017 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో చేపడుతున్న మౌన పోరాటాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు వేస్తున్న ఎత్తుగడలపై ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. బికినీ షోలకు అనుమతి ఇచ్చిన బాబు సర్కారు మౌనంగా తమ నిరసన తెలియజేస్తామన్న యువతకు అడ్డం పడటం ఏం న్యాయమని ఆమె ప్రశ్నించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఒక మంచి కారణంతో విశాఖ బీచ్ లో మౌన ప్రదర్శన చేస్తామంటే అభ్యంతరమేముంది? దీనికెందుకు అనుమతి ఇవ్వరు. బికినీ షోలకు పర్మిషన్ ఇచ్చి.. దీనికి నిరాకరించడం ఏం న్యాయం? విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ విషయంలో ప్రతిపక్షాల ఒత్తిడి తట్టుకోలేకే ఆ తర్వాత దానిపై వెనక్కి తగ్గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలన్న కోరిక ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేనట్లుంది. దీని బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారటే.. ప్రాజెక్టుల ద్వారా వచ్చే కమిషన్ల కోసమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర హక్కుల కోసం పోరాడకపోగా.. ప్రజాస్వామ్య పద్ధతిలో.. శాంతియుతంగా యువత నిరసన తెలపాలని చూస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం’’ అని రోజా ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/