Begin typing your search above and press return to search.
పేర్లు చెప్పి మరీ.. ఉతికి ఆరేసిన ఫైర్ బ్రాండ్
By: Tupaki Desk | 26 Feb 2017 10:04 AM GMTపేరుకు రోజా అయినా.. ఆమెను అందరూ ఫైర్ బ్రాండ్ గానే కీర్తిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆమె మాటలు ఉంటాయి. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కు పెట్టే విషయంలో ఆమె ఏ మాత్రం తడబడరు. తాజాగా ఏపీ తెలుగు తమ్ముళ్ల మీద ఆమె ఫైర్ అయ్యారు. పేరు పేరున.. ఏపీ అధికారపక్ష లీలల్ని ప్రస్తావించి ఉతికి ఆరేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు చేసిన రోజా మాటలు తమ్ముళ్లకు బీపీ పెరిగిపోయేలా చేశారని చెప్పాలి.
బాబు మంత్రివర్గం రావణాసురలతో నిండి పోయిందని ఆరోపించిన ఆమె.. వారి ఆస్తుల మీద సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వేలాది కోట్లు ఎగ్గొట్టిన సుజనాకు కేంద్రంలో.. వందల కోట్లు ఎగ్గొట్టిన గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవులు దక్కాయన్నారు. మహిళలపై వేధింపులు ఉన్న నలుగురిలో ఇద్దరు మంత్రులు ఏపీ క్యాబినెట్ లో ఉన్నారంటూ..వారిద్దరూ దేవినేని ఉమ.. అచ్చెన్నాయుడని వెల్లడించారు. ల్యాండ్ ఫూలింగ్ పేరుతో బావా బామ్మర్ధులైన గంటా.. నారాయణ ఇద్దరూ దోచుకున్నారన్న ఆమె.. డ్రగ్స్ కు.. గంజాయికి విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు.
కోట్లాదిరూపాయిలు కొల్లగొడుతున్న టీడీపీ నేతలకు.. విశాఖ రైల్వే జోన్ సాధనపై దృష్టిపెట్టటం లేదన్నారు. ఓటుకు నోటుకేసు నుంచి బయటపడేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైల్వే జోన్ ను తాకట్టు పెట్టినట్లుగా ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం దుకాణాలు విశాఖలోనే ఉన్నాయని.. బెల్టు షాపులు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారన్నరోజా.. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి గంజాయి సాగు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్న ఆమె.. ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా? లేక రౌడీ రాజ్యామా? అని ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాలో కరవు బారిన పడి పెద్ద ఎత్తున రైతులు వలసల బాట పట్టినట్లుగా మండిపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్న రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి వలసలు భారీగా సాగుతున్నాయన్నారు. ఇలా.. ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు.. పలువురు మంత్రులపై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలకు ఎవరు సమాధానం ఇస్తారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/