Begin typing your search above and press return to search.
సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాంటివాడు - రోజా
By: Tupaki Desk | 14 Oct 2016 9:40 AM GMTఅసలే ఫైర్ బ్రాండ్. ఆపై ఆవేశంగా ఉన్నారు. అలాంటి వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థిపై ఎంతలా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు.. జగన్ మధ్య రూ.10వేల కోట్ల ఆస్తుల వివాదం నడుస్తున్న వేళ.. ఇటీవల కాలంలోబాబు చేసిన పలు వ్యాఖ్యల్నిప్రస్తావిస్తూ.. రోజా చెడామడా తిట్టేయటం కనిపిస్తుంది.
మామూలుగానే చంద్రాబాబు ఊసు ఎత్తితేనే విరుచుకుపడే రోజా.. తాజా మీడియా సమావేశంలో మరింతగా చెలరేగిపోయారు. ఇటీవల కాలంలో చంద్రబాబు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ ఆమె అన్న మాటల్ని ఆమె మాటల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తే..
‘‘చంద్రబాబుకు తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ - ఖర్జూరనాయుడు ఎవరూ గుర్తురాలేదు గానీ.. వెంకయ్య నాయుడు గుర్తుకొచ్చాడంటే ఆ అవిభక్త కవలలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎలా తోడుగా ఉన్నారో తెలుస్తుంది. వీళ్లిద్దరూ కలిసి అమెరికాను ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలి. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయంట. ఈయన కోటీశ్వరుడి కొడుకు కాదు.. రెండెకరాల నుంచే వచ్చారు. అంత అహంకారం ఎందుకు?’’
‘‘ప్రపంచంలో గొప్ప కట్టడాలన్నీ ఇండియన్లే కడుతున్నారు. నాసాలో 50 శాతంమంది భారతీయ ఇంజనీర్లే ఉన్నారు. కానీ.. వారి పొగిడేస్తూ.. మనోళ్లను తిట్టేస్తూ ఇంత నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును ఏం చేయాలి? ఎన్నికల్లోమహిళలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు గానీ.. ఆడబిడ్డలంటే భారతీయులంటే ఆయనకు ఎందుకింత అలుసు. తెల్లగా ఉంటే చాలు..గొప్పోళ్లని అనుకోవడం దురదృష్టకరం. అన్ని దేశాల్లో అణుప్లాంట్లు మూసేస్తుంటే.. ఇక్కడ రష్యా అణు ప్లాంట్లు కట్టడానికి అవకాశం ఇస్తున్నారు’’
‘‘పీహెచ్ డీ చేశానని బాబు అంటున్నారు. అప్లికేషన్ అయినంత మాత్రాన పీహెచ్ డీ చేసినట్లు కాదు. సీఎంగా ఉండి ఇలా పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారంటే ఎంత మోసం చేస్తున్నారో తెలుస్తుంది. చివరకు భారతీయులను అవమానించడంలో అడ్వకేట్ జనరల్ కూడా ముందున్నారు. మనకు గాడిదలు వద్దు.. సింగపూర్ గుర్రాలు కావాలన్నారు. ప్రజలు వీళ్లకు ఏశిక్ష విధించాలో ఆలోచించుకోవాలి. తెలుగువారిని ఇంతగా అవమానించిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో?’’
‘‘కేజ్రీవాల్ ఒక చిన్న వ్యాఖ్య చేస్తే ఆయన్ను దేశద్రోహిగా అంతా అభివర్ణిస్తారు. బాబు మాటలు కూడా దేశద్రోహమేనని ప్రకటించాలి.. చంద్రబాబును సీఎంపదవి నుంచి తీసేసి రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. తన కొడుకు లోకేశ్ మీద వచ్చిన ప్రచారాన్ని తప్పించుకోడానికి నల్లధనం అంశాన్ని ఎలా ముందుకుతెచ్చారో చూశాం. నల్లధనం విషయం చంద్రబాబుకు కూడా తెలిసిందంటే అదిఆయన డబ్బు గానీ, ఆయన బినామీల డబ్బు గానీ అయి ఉండాలి. చంద్రబాబు బ్లాక్ మనీ కి బ్రాండ్ అంబాసిడర్. చీటింగ్ ను ఛీర్ గర్ల్ లా ప్రమోట్ చేస్తారు. కమీషన్లకు ముద్దుబిడ్డ. కరప్షన్ కన్నబిడ్డ’’
‘‘ఆయన దొంగతనాన్ని కప్పి పుచ్చుకోడానికి ఆయన పెంపుడు రాజకీయ నేతలైన ఉమా లాంటివాళ్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు - ఆయన కొడుకు..కోడలు వాళ్ల ఆస్తుల మీద విచారణకు ఎందుకు సిద్ధం కావట్లేదు? ఆయనకు సిగ్గు.. లజ్జ ఉంటే జగన్ మీద చేసిన ఆరోపణలను నిరూపించాలి. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారని యనమల అంటున్నారు..ఆయన మతి ఉండే మాట్లాడుతున్నారా? రెండున్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలుంటే వాటిని ఎందుకు బయట పెట్టడం లేదు’’
‘‘పెద్ద బాబుకు తోడు చినబాబు బయల్దేరాడు. ఆయన సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాంటివాడు పబ్లిసిటీ ఎక్కువ. పని తక్కువ. కనీసం మండల కమిటీ ఎలానియమిస్తారో కూడా తెలియని లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట. ఈయన జగన్కు పోటీ అట. లోకేష్ తెలుసుకో.. నిన్ను కన్న చంద్రబాబుతో పాటు మోదీ.. పవన్ కలిసికట్టుగా ఎన్నికలకు వస్తే.. రాయలసీమ గడ్డమీద పుట్టిన దమ్మున్నోడిగా ఒంటరిగా పోటీపడ్డ వ్యక్తి జగన్. నిన్ను చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదు’’
‘‘సింగపూర్ లో బ్యాంకులన్నీ నిండిపోయాయి కాబట్టి అమెరికాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఈయన రాజీనామా చేసే వరకు ప్రజలు వదలకూడదు. చంద్రబాబు యావద్దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నల్లధనం విషయంలో ఆయనకు సవాలు చేస్తున్నాం.. నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే చంద్రబాబు - ఆయన భార్య.. కొడుకు.. కోడలు.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకునే ధైర్యం ఉందా అని సవాలు చేస్తున్నాం’
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/