Begin typing your search above and press return to search.
రోజా చెప్పిన చంద్రబాబు గుండు కథ సూపర్
By: Tupaki Desk | 2 Jun 2017 7:57 AM GMTచంద్రబాబు నవనిర్మాణ దీక్షలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. మూడేళ్లుగా ప్రజలను నాశనం చేస్తూ ఇప్పుడు నవనిర్మాణదీక్షల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. లోకేష్ ను అడ్డదారిలో మంత్రిని చేయడం తప్ప ఏ ఒక్క యువకుడికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి నున్నగా గుండు కొట్టించేస్తారని... ఆ తరువాత 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కించి, అభివృద్ధి వైపు నడిపిస్తారని... అప్పుడు ఇదే చంద్రబాబు అదంతా తన ఘనతే అని చెప్పుకొంటారని ఆమె ఉతికి ఆరేశారు. ఆ రోజు తాను నున్నగా గుండు గీయడం వల్లే ఈ రోజు ఒత్తుగా జుట్టువచ్చిందని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇప్పుడు రెండు గుండ్ల సిద్దాంతంగా మారిందని రోజా ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి మారానని వేడుకుంటే ప్రజలు చంద్రబాబుకు ఓటేశారని… కానీ గతంలో తొమ్మిదేళ్లలో చేసిన అవినీతిని ఇప్పుడు మూడేళ్లలోనే చంద్రబాబు చేశారని రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే... చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉందని... అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే, నవ నిర్మాణ దీక్షతో వారం పాటు మీ సంబరాలు ఏంటని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/