Begin typing your search above and press return to search.
'బోండా ఉమ లిక్కర్ షాపులో వర్కర్ లా మాట్లాడావ్!'
By: Tupaki Desk | 3 March 2020 12:18 PM GMTతెలుగుదేశం పార్టీ వాళ్లు మద్యం అమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా. ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకడం లేదంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రోజా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ మద్యం బాటిళ్లను ప్రెస్ మీట్లో ప్రదర్శిస్తూ.. ఏపీలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మంచి బ్రాండ్ ల మద్యం ఏపీలో దొరకడం లేదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇది వరకే ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీకి మద్యం మీద అంత మోజు ఎందుకు అని ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరు తాగుబోతుల తరఫున మాట్లాడుతున్నట్టుగా ఉందని రోజా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి.. మద్యం బాటిళ్లను ప్రదర్శించేంత స్తాయికి ఆ పార్టీ దిగజారిందని, అది తెలుగుదేశం పార్టీనా లేక మద్యం దుకాణమా? అని రోజా ప్రశ్నించారు.
లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు మద్యం షాపులు అయిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతూ ఉన్నారని, మద్యం ధరలను ప్రభుత్వం పెంచితే, అదేదో నిత్యవసర సరకుల ధరలు పెరిగినట్టుగా టీడీపీ అతిగా స్పందిస్తూ ఉందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడిన తీరు లిక్కర్ షాపులో వర్కర్ లా ఉందని రోజా వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో బెల్ట్ షాపులను తెలుగుదేశం నేతలే నిర్వహించి మద్యాన్ని ఏరులై పారించారని, అదేమంటే.. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ నాటి మంత్రులు మాట్లాడారని రోజా గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకా బెల్ట్ షాపులను తుడిచిపెట్టేయగా, ఇరవై శాతం వరకూ షాపుల సంఖ్య తగ్గిపోయిందని రోజా అన్నారు. అయినా మద్యం మద్యం అంటూ పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రోజా అన్నారు.