Begin typing your search above and press return to search.
నగరి తనదేనంటోన్న రోజా
By: Tupaki Desk | 3 Sep 2021 12:30 AM GMTరాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా మారిన సినీ నటి ఆర్కే రోజాకు చిత్తూరు జల్లా నగరి నియోజకవర్గంపై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రెండు సార్లు వైసీపీ తరపున ఆమె ఇక్కడి నుంచి విజయం సాధించాడు. 2014లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైనప్పటికీ ఆమె గెలిచారు. ఇక 2019లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్ష నేతలతో పాటు తన పార్టీలోనే ఉన్న వ్యతిరేకులను ఎదుర్కొని నిలబడుతున్నారు. కానీ ఆమె ధోరణిని వ్యతిరేకించే కొంతమంది నేతలు తనను వచ్చే ఎన్నికల్లో వేరే నియోజవకర్గానికి పంపిస్తారనే ప్రచారం చేస్తున్నారు. నగరికి ఆమెకు ఉన్న బంధం తెగిపోతుందని తెరచాటు నుంచే వ్యవహారం నడిపిస్తున్నారు.
సొంత పార్టీలోని వ్యతిరేకులే ఆమెపై చేస్తున్న ఈ ప్రచారంపై నగరిలో కొంత కాలంగా చర్చ సాగుతోంది. ఈ విషయం రోజా వరకూ చేరింది. దీంతో తన నియోజకవర్గంపై పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆమె తరచుగా ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తోంది. ఏదో ఓ పని పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల ఫలితాలను తన చేతుల మీదుగా అందించడం నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి రేషన్ అందుతోందా? పింఛన్ ఇచ్చారా? అంటూ ప్రజలతో మాట్లాడుతోంది. అయితే ఇలా తన వ్యవహరించడం వెనక వేరే వ్యూహం ఉందని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను నగరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తనని ఇక్కడి నుంచి ఎవరూ దూరం చేయలేరని చాటి చెప్పడమే ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది.
అందులో భాగంగానే కేజే కుమార్ బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరపత్రాలు పంచడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. తనకు ఎందుకు టికెట్ ఇస్తారో ఇతరులకు ఎందుకు ఇవ్వరో అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ ఉన్న ఈ కరపత్రాలను రోజా అభిమానుల పేరిట పంచుతున్నారు. అయితే ఇదంతా అభిమానులే చేస్తున్నారని తనకు సంబంధం లేదని రోజా చెబుతున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టికెట్ దక్కదేమోననే ఆందోళనతోనే రోజా ఇవన్నీ చేయిస్తున్నారని కేజే కుమార్ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు జగన్ త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో రోజాకు కచ్చితంగా పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నగరిలో ఇలా రాజకీయ వేడి కొనసాగుతుండడం గమనార్హం.