Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళం వార్త : రోజా గారూ ! మా ఊరికి రండి ? ఎ స్మాల్ రిక్వెస్ట్ !

By:  Tupaki Desk   |   14 April 2022 3:28 AM GMT
శ్రీ‌కాకుళం వార్త : రోజా గారూ ! మా ఊరికి రండి ? ఎ స్మాల్ రిక్వెస్ట్ !
X
బుద్ధుడు న‌డ‌యాడిన నేల ఓ వైపు, రాచ‌న‌గ‌రి వీధులు మ‌రో వైపు, చుట్టూ స‌ముద్రం మ‌ధ్య‌లో కొండ‌లు ఇదే విధంగా ప్ర‌కృతి అందాల‌తో అలరారే ప్రాంతం మ‌రో వైపు..ఇవే కాదు కోన‌సీమ‌ను త‌ల‌పించే ఉద్దానం ఇంకో వైపు. ఎన్ని ఉన్నా కూడా పర్యాట‌కుల‌కు ఆహ్లాదం ఇచ్చే విధంగా వస‌తులు లేవు. త‌మ జిల్లా అభివృద్ధి ఆ విధంగా లేనే లేదు అని శ్రీ‌కాకుళం వాసులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ త‌రుణాన కొత్త మంత్రి వ‌చ్చారు క‌దా ఆమె కానీ ఇటు వ‌స్తారా అని ఆశ‌తో ఎదురు చూస్తున్నా సంబంధిత క‌లలూ మ‌రియు ఊహ‌లూ అమ‌ల్లోకి వ‌చ్చేలా లేవు..అని తెలుస్తోంది. ఒక‌వేళ కొత్త మంత్రి ఇటుగా వ‌స్తే కొన్నయినా నెర‌వేరుతాయా? ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

విశాఖ కు కానీ శ్రీ‌కాకుళంకు కానీ ఓ సారి టూరిజం శాఖ మంత్రి వ‌స్తే బాగుండు అన్న మాట బ‌లీయంగా వినిపిస్తుంది ప‌బ్లిక్ డొమైన్ లో ! ఎందుకంటే ప‌ర్యాట‌క శాఖ‌ను నిర్వ‌హిస్తున్న‌ది గౌర‌వ మంత్రి రోజా సెల్వమ‌ణి క‌నుక ! ఆమె వ‌స్తే త‌మ జీవితాలు బాగు ప‌డ‌తాయి అని ఆయా ప్రాంత ప్ర‌జ‌లు కోరుకోవ‌డం త‌ప్పు లేదు కానీ ఆమె వ‌స్తారా రారా అన్న‌దే సిస‌లు సందేహం. ఇప్ప‌టికే విశాఖ లో చాలా భూములు ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నా చెందలేదు.

అదే విధంగా శ్రీ‌కాకుళం లో కూడా చాలా టూరిజం ప్లేసులు ఉన్నా కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆదాయం తీసుకువ‌చ్చే ప‌నులు కొన్ని రోజా హయాంలో జరిగితే ఆనందించాల‌ని ఆనంద‌పురం దగ్గ‌ర నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ అంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప‌ర్యాట‌క శాఖ కే కాకుండా ఆమె యువ‌జ‌న శాఖ కు కూడా మంత్రి.. అంతేకాదు సాంస్కృతిక శాఖ కూడా ఆమె ప‌రిధి లో ఉన్న‌దే !

వాస్త‌వాని కి శ్రీ‌కాకుళం జిల్లా, అర‌స‌వ‌ల్లితో స‌హా ప‌లు ప్రాచీన పుణ్య క్షేత్రాలు త‌దిత‌ర ప్రాంతాలు ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. కానీ చెందడం లేదు. జిల్లా కేంద్రంకు ద‌గ్గ‌ర ప్రాంతాలు అయిన స‌ముద్ర తీరం ఉన్న క‌ళ్లేప‌ల్లి, కిల్లిపాలెం లాంచి చిన్న,చిన్న గ్రామాలు కూడా ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెంద‌డం లేదు. మొగ‌దలపాడు, క‌ళింగ‌ప‌ట్నం, శివ‌సాగ‌ర్ బీచ్ లు కూడా ఎటువంటి అభివృద్ధిలో లేవు. భావ‌న‌పాడు ఫిషింగ్ హార్బ‌ర్ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న ఉన్నాయి క‌నుక అక్కడి ప్రాంతంలో ప‌ర్యాట‌క సంబంధ అభివృద్ధి ఆశించ‌డ‌మే త‌ప్పు!

ఇంకా చెప్పాలంటే న‌దీ తీరాన బాగా అభివృద్ధి చెందిన రివ‌ర్ వ్యూ పార్కు అదేవిధంగా అక్క‌డ బోటు షికారు ఈ జిల్లా వాసులు కోరుకోవ‌డ‌మే త‌ప్పు! అదేవిధంగా మ‌డ్డువ‌ల‌స ప్రాజెక్టు ప‌రిస‌ర ప్రాంతాల‌ను కూడా అభివృద్ధి చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతం విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిధిలో ఉంది. జిల్లాల విభ‌జ‌న‌తో విజ‌య‌న‌గ‌రం ప‌రిధిలోకి వెళ్లింది. అదే విధంగా మ‌న్యం ప్రాంతాల‌నూ టూరిజం ప‌రంగా అభివృద్ధి చేసే ప‌నులు కొన్ని టీడీపీ చేప‌ట్టింది వాటికి కూడా ఈ ప్ర‌భుత్వం కొనసాగింపు ఇవ్వ‌వచ్చు. అస‌లు యువ‌త కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌వ‌చ్చు. స్థానిక క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు జిల్లా కే త‌ల‌మానికంలా నిలిచే విధంగా సాంస్కృతిక కేంద్రాల‌ను నెల‌ కొల్ప‌వ‌చ్చు. కానీ రోజా హ‌యాం లో ఇవ‌న్నీ జ‌రుగుతాయా? అందుకు త‌గ్గ నిధులు ఉన్నాయా? సందేహాలే మిగులుతాయా?