Begin typing your search above and press return to search.

రోజాకు వచ్చిన కొత్త కష్టం!

By:  Tupaki Desk   |   17 Feb 2022 11:30 AM GMT
రోజాకు వచ్చిన కొత్త కష్టం!
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్ అయిన రోజా సెల్వ‌మణి ఇబ్బందుల్లో ప‌డ్డారు.ఆమె ఏం చెప్పినా అవేవీ నెగ్గుకురావ‌డంలేదు. అస‌లు ఆమె మాట వినిపించుకునే స్థితిలో ఇవాళ అధినాయ‌క‌త్వం లేదు.దీంతో ఆమె త‌రుచూ త‌న పంచాయ‌తీని అధికారుల ఎదుట కానీ లేదా అధికార పార్టీ పెద్ద‌ల ఎదుట కానీ పెట్టినా ఫ‌లితం లేకుండా పోతోంది. తీర్పు మాత్రం అస్స‌లు అనుకూలంగా ఆమెకు అనుగుణంగా రావ‌డం లేదు.ఇదంతా త‌న ప్ర‌త్య‌ర్థుల కుట్రే అని రోజా ఆరోపిస్తున్నారు.

వైసీపీలో ఉన్న కొంద‌రు టీడీపీ నాయ‌కుల‌తో ముఖ్యంగా గాలి ముద్దు కృష్ణ‌మ (దివంగ‌త నేత‌) బ్యాచ్ తో తిరుగుతున్నార‌న్న‌ది రోజా ఆరోప‌ణ.ముఖ్యంగా గాలి ముద్దు కృష్ణమ చిన్న కుమారుడు జ‌గ‌దీశ్ వ్య‌వ‌హార శైలి, మాట్లాడే తీరు అన్నీ స‌రిగాలేవ‌ని,స్థాయిని మ‌రిచి మాట్లాడుతున్నార‌ని మూతి ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని హెచ్చ‌రించారు.

ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు అలెర్ట్ అయి,నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోని రోజా ప‌ళ్లే రాలుతాయ‌ని, తాము అనుకున్న విధంగా ఇక్క‌డ అభివృద్ధి అన్న‌ది లేనేలేద‌ని మీడియాముఖంగానే తిట్టిపోస్తున్నారు ఆమెను! అప్ప‌టి వివాదం నేప‌థ్యంలో టీడీపీ వ‌ర్గానికి మంత్రి పెద్ది రెడ్డి సాయం చేశారన్న అభియోగం ఒక‌టి రోజా చేస్తున్నారు.అదేవిధంగా నగ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెను తిర‌గ‌నివ్వ‌కుండా చేస్తామ‌ని కొంద‌రు ఆమెను త‌రుచూ బెదిరిస్తున్నారు.

ఇవి విని భావోద్వేగానికి లోనై త‌నను ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేర‌ని, ఏ బిడ్డా ఇది నా అడ్డా అని పుష్ప రేంజ్ లో కౌంట‌ర్లు పాస్ చేస్తున్నారు రోజా.ఒక‌ప్పుడు టీడీపీలో ఉన్న‌ప్పుడు శ‌ర‌వేగంగా రాజ‌కీయాలు న‌డిపిన రోజాకు ఇప్పుడు అదే పార్టీ నుంచి పొలిటిక‌ల్ సెటైర్లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు సొంత పార్టీ నేత‌లే ఆమెకు అభివృద్ధి నిరోధ‌కులుగా మారిపోయారు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ ఆమెను కొంద‌రు అడ్డుకున్నారు.ఓటీఎస్ చెల్లించేదేలేద‌ని న‌గ‌రిలో కొంద‌రు బాధితులు అడ్డుకున్నారు.

వారంతా త‌మిళం తెలిసిన త‌మిళం మాత్ర‌మే తెలిసిన స్థానికులు.వారికి త‌న గోడు త‌మిళంలో వివ‌రించి చెప్పినా వారెవ్వ‌రూ వినిపించుకోలేదు. గో బ్యాక్ రోజా అని మాత్ర‌మే అని వినిపించి వాళ్లేం చెప్పాలనుకున్నారో అదే చెప్పి వెళ్లారు. ఇది కాకుండా కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న‌ల్లో రోజాకు మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది.ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం కాస్త చిత్తూరు జిల్లా ప‌రిధిలోకి వెళ్లిపోయింది.

అలా కాకుండా త‌మ‌కు కూత‌వేటు దూరంలో ఉండే తిరుప‌తి కేంద్రంగా ఏర్పాట‌య్యే కొత్త జిల్లా (బాలాజీ జిల్లా)లో త‌మ‌ను క‌ల‌పాల‌ని వేడుకుంటున్నారు రోజా. అధికార పార్టీ స‌భ్యురాలిని క‌నుక నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌లేన‌ని క‌నుక సంప్ర‌తింపుల ద్వారానే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటాన‌ని అంటున్నారు.

ఇదే స‌మ‌యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గం తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (తుడా) ప‌రిధిలో ఉంద‌ని, అందుకే ఆ పాటి అభివృద్ధి అయినా జ‌రుగుతుంద‌ని,ఇప్పుడు క‌నుక త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుని వెళ్లి చిత్తూరులో క‌లిపితే సంబంధిత ప‌నుల‌న్నీ ఎక్క‌డివ‌క్క‌డ నిలిచిపోతాయి అని అంటున్నారామె.

ఇదే విష‌యాన్ని తాము ముఖ్య‌మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాన‌ని,త‌మ మ‌నోభావాల‌ను ఆయ‌న గౌర‌విస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని చెబుతున్నారామె.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఒక‌ప్పుడు రోజాకు ఉన్న గుర్తింపు కానీ గౌర‌వం కానీ ఇవాళ పార్టీలో లేవు. అంటే ఆమెకు రావాల్సినంత పేరు కానీ ప్ర‌ఖ్యాతి కానీ ఏవీ ద‌క్క‌కుండా చేసేందుకు స్టేట్ లెవ‌ల్ లీడ‌ర్ ను కాస్త న‌గ‌రికే ప‌రిమితం చేసేందుకు వ‌రుస స‌మ‌స్య‌లు సృష్టించి ఆమె పరువు తీసేందుకు కొంద‌రు ప్ర‌త్య‌ర్థులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం.