Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి రోజా భర్త స్టేట్‌మెంట్ చూడండి!
By: Tupaki Desk | 4 May 2022 7:53 AM GMTఆయన ఏపీకి చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా భర్త. ఆయనే ఆర్కే సెల్వమణి. తమిళనాట దర్శకుడిగా పేరుంది. అంతేకాదు.. అంతో ఇంతో బాధ్యత ఉన్న వ్యక్తి. పైగా.. రాజకీ యంగా తమకు ఉనికిని ఇచ్చిన రాష్ట్రం ఏపీ. కానీ, ఆ రాష్ట్రంపైనే ఆయన అక్కసు వెళ్లగక్కారు.
ఏపీలో షూటింగులు చేయొద్దంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఏపీలో రాజకీయంగా నిలదొక్కుకున్న ఈ ఫ్యామిలీ ఏదైనా చేయాలం టే.. ఏపీకే చేయాలి. కానీ, సదరు సెల్వమణి మాత్రం ఏపీపై తీవ్ర ఉదాసీన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఒక్క ఏపీపైనే కాదు.. తెలంగాణపైనా.. ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. ఏపీలోని వైజాగ్, తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా షూటింగులు చేయొద్దంటూ.. పిలుపునిచ్చారు. ప్రస్తుతం సెల్వమణి చేసిన వ్యాఖ్య లు.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం.. ఫిలం ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి సెల్వమణి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి ఆయన.. ఏపీలో వైజాగ్‌లో సినిమాలు తీయోద్దంటూ పిలుపునివ్వడం. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో.. అజిత్ హైదరాబాద్ తదితర నగరాల్లో షూటింగులు చేస్తున్నారని.. దీనివల్ల తమిళనాడుకు చెందినసినీ కార్మికులు నష్టపోతున్నారని.. కాబట్టి.. షూటింగులను తమిళనాడులోనే చేయాలని ఆయనను కోరినట్టు తెలిపారు.
అంతేకాదు.. వైజాగ్, హైదరాబాద్‌లో షూటింగులు చేయొద్దని కూడా చెప్పామన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే.. తాము రాజకీయంగా ఎదిగింది.. ఆస్తులు సంపాయించుకుంది.. తెలుగు సినిమా నుంచే.
అలాంటి తెలుగు నేలపై షూటింగులు వద్దనడం ఒక అంశమైతే... సెల్వమణి.. భార్య, మంత్రి రోజా.. ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వైజాగ్లో షూటింగులు చేయాలంటూ.. సినీ ఇండస్ట్రీకి షరతులు పెట్టింది. దీంతో తెలుగు సినిమా మొత్తం.. వైజాగ్‌లో షూటింగులకు రెడీ అవుతోంది. కానీ, ఒక మంత్రి గారి భర్త అయి ఉండి.. ఏకంగా.. ఏపీలోనే షూటింగులు వద్దని చెప్పడం.. ఏంటనేది ప్రధాన ప్రశ్న. తమ ఉనికికోసం.. ఇక్కడి ప్రజలు.. ఇక్కడి కార్మికులు ఓటేయాలి.. గెలిపించాలి. కానీ, ఇక్కడ మాత్రం షూటింగులు చేసుకునేందుకు వద్దన్నమాట. వాట్ ఏ.. మోరల్!! అంటున్నారు ప్రేక్షకులు.