Begin typing your search above and press return to search.
'రోజా'.. ఒక విధేయ బాంబు
By: Tupaki Desk | 19 March 2015 4:14 AM GMTసినీ నటిగా రోజా ఒక సంచలనం. ఆ తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశం మరో చర్చనీయాంశం. సినిమా వేషాలయ్యాక.. బుల్లితెర మీద ఆమె అదరగొడుతుంటే అదో ట్రెండు. ఇలా అడుగుపెట్టిన చోటల్లా అయితే.. సంచలనమో.. లేదంటే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారటం రోజాకు అలవాటే.
అలాంటి రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీ అధికార పక్షంలో ఆడ.. మగ అన్న తేడా లేకుండా విపక్షానికి చెందిన ఎవరిపైన అయినా ఆరోపణలు.. విమర్శలు చేశారా? అంటే అది రోజా మీద మాత్రమే. రన్నింగ్‌కామెంటరీ ఇవ్వటం.. ఇష్టారాజ్యంగా తిట్టేయటం లాంటివి చేస్తారని పలువురు అధికారిక సభ్యులు పదే పదే ప్రస్తావిస్తుంటారు.
దూకుడుగా వ్యవహరించే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కొడాలి నాని కానీ.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీదనైనా కాస్తోకూస్తో మినహాయింపు ఉంటుందేమో కానీ.. రోజా మీద మాత్రం అందరూ ఒకేలాంటి ఫిర్యాదు చేస్తారు. నిజంగా ఆమె ఎలాంటి మాటలు మాట్లాడతారో వినపడదు కాబట్టి.. ఆమె చేష్టల్ని చూస్తూ ఉంటారు అసెంబ్లీ సమావేశాల్ని కవర్ చేసే మీడియా మిత్రులు.
ఆమె ఎంత ఉత్సాహంగా.. దూకుడుగా వ్యవహరిస్తారన్నది రాజకీయ నేతలకే కాదు.. మీడియా వారికి కూడా బాగానే తెలుసు. ఒక్క ఏపీ అధికారపక్షంతో తప్ప.. మిగిలిన వారితో సరదాగా ఉంటూ సోషల్‌గా మూవ్ అవుతుంటారు. మరి.. ఇలాంటి సీమ టపాకాయను భరించటం తెలుగుదేశం తమ్ముళ్లకు కాస్త కష్టమైంది. అటు చూస్తే మహిళ.. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మొత్తానికి దెబ్బ పడుతుంది. అందుకే.. రెండు మాటలు అన్నా.. నోర్మూసుకొని ఉండటం ఏపీ అధికారపక్షానికి కాస్త అలవాటేనన్న మాట కూడా వినిపిస్తోంది.
ఇలాంటి రోజా బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ మీద టార్గెట్ చేసిన తెలుగు తమ్ముళ్లపై.. తనకు సహజంగా ఉండే స్వామిభక్తిని ప్రదర్శిస్తూ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా తనకుండే ఉత్సాహానికి.. ఆవేశాన్ని కలగలిపారు. అంతే చెలరేగిపోయారు. తామేం చేసినా అది బయటకు రాదన్న ధీమా కావొచ్చు. వచ్చినా..సర్ది చెప్పుకోగలమన్న ధైర్యం కావొచ్చు.. ఆమె సభాసాక్షిగా చెలరేగిపోయారు.
ఆమె పక్కన ఉన్న మహిళా నేతలు సైతం.. రోజమ్మ చెలరేగిపోవటాన్ని చూస్తుండిపోయారు. ఇక.. జ్యోతుల నెహ్రూ లాంటి సీనియర్ నేతలు కలుగజేసుకొని రోజమ్మను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఆ లోపులే జరగాల్సిందంతా జరిగిపోయింది.
తనను కడిగేసిన మంత్రి పీతల సుజాను ఉద్దేశించి ఆమె ఏ స్థాయిలో విరుచుకుపడ్డారన్నది.. తాజాగా ఏపీ చీఫ్ విప్ విడుదల చేసిన సీడీలను చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆమె ఎందుకంత తీవ్రస్థాయిలో వ్యవహరించారని అడిగినప్పుడు ఆమె నోట వెంట వచ్చిన మాట విన్నప్పుడు చిన్నపాటి ఆశ్చర్యం కలగటం ఖాయం.
ఇంతకీ రోజా ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఆమెకేమైనా చంద్రబాబు అండ్ కోతో ఆగర్భ శత్రుత్వం ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. వైఎస్.. బాబుల మాదిరి ఆమెకు ఎవరికి రాజకీయ ప్రత్యర్థి కాదు. అయినప్పటికీ ఆమె ఎందుకింత తెగిస్తున్నారంటే.. వచ్చే సమాధానం చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. అధినేత మీద ఉన్న అభిమానం.. జగన్ మీద ఈగ కూడా వాలనీయకూడదన్న మొండితనం.. తమ అధినేతను ఎవరు ఏమన్నా ఊరుకోకూడదన్న మూర్ఖత్వంతో కూడిన ప్రేమాభిమానమే ఇంతటికి కారణం.
అధికారపక్షంపై తాను చేస్తున్న పనులకు రోజా దారణమైన ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అసెంబ్లీ నుంచి దీర్ఘకాలం పాటు సస్పెన్షన్ గురయ్యే ప్రమాదం ఉంది. ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు మీద పడినా పడొచ్చు. ఇదంతా ఆమె.. తాను నమ్మిన పార్టీ కోసం.. తాను అభిమానించే అధినేత కోసం ఆమె ఇంత తీవ్రస్థాయిలో వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు ఒక ఆత్మాహుతిదళ సభ్యురాలు గుర్తుకు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆత్మాహుతి సభ్యులకు తాము నమ్మిన సిద్ధాంతం.. అనుసరించే మార్గం కోసం దేనికైనా సై అనేస్తారు. అందుకోసం తమను తాము బలి పెట్టుకోవటానికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి గుణం రోజాలో కనిపిస్తుంది.
అది.. రోజా గొప్పతనమా? లేక జగన్ అదృష్టమా? ఇంతకీ.. మీరెందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఒక టీవీ ఛానల్‌లో అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే.. ''మా అధినేత జగన్‌ను అంటుంటే చూస్తూ ఊరుకోవాలా? అధికారపక్షం ఆగడాల్ని భరించాలా? మా అధినేతను అన్నేసి మాటలంటే ఎలా ఊరుకుంటాం'' అని ఆవేశంగా చెబుతున్న మాటలు విన్నప్పుడు.. ఒక విధేయ బాంబులా.. ఒక జగన్ ఆత్మాహుతి దళ సభ్యురాలిగా అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.
గరుడ