Begin typing your search above and press return to search.
రోజమ్మ- అమరావతి వచ్చింది - జగనన్నను కలిసింది
By: Tupaki Desk | 11 Jun 2019 2:14 PM GMTఇంత అవకాశం ఉంటే చాలు... వార్తలు అల్లేయడానికి డిజిటల్ మీడియా రెడీగా ఉంటుంది. దానిని ఆపడమూ కష్టమే. వాటి బాధితులు బయటకు వచ్చినపుడే నిజాలు బయటపడతాయి. రోజాకు కూడా తాజాగా ఇలాగే జరిగింది. జగన్ అనేక సమీకరణాల నేపథ్యంలో మంత్రి వర్గ కూర్పు చేయడంతో రోజాకు స్థానం దక్కలేదు. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమె మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. దీంతో ఆమె అలిగిందని - ఆమె బాధపడుతోందని ప్రచారం జరిగింది. అదంతా ఉత్తిదే అని ఆమె స్వయంగా కొట్టిపారేశారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతికి వచ్చి ఎమ్మెల్యే రోజా తాడెపల్లి లోని క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే తాను మంత్రి అవుతానని ఆమె ఆశించిన మాట నిజమే గాని - ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి రాలేదని అలగలేదు. ఈ అలకపై వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడం వల్లే ఆమెపై గాసిప్స్ పెరిగాయి. చివరకు ఆమె స్వయంగా దీనిపై వివరణ ఇచ్చారు. అనంతరం జగన్ ను కలిసి చిరునవ్వుతో ఫొటో దిగారు.
ఈరోజు ఆమె అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి వస్తే దాని మీద కూడా పదవి ఇవ్వడానికి జగన్ పిలిచారని వార్తలు వచ్చాయి. అది కూడా నిజం కాదని ఆమే స్పష్టం చేశారు. అయితే, పార్టీ మొదటి నుంచి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు జగన్ త్వరలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆమె పదవుల గురించి తనకు ఏ బాధ లేదని - పార్టీ ముఖ్యమని తేల్చేశారు.