Begin typing your search above and press return to search.

అసెంబ్లీ వాయిదాతో రోజాకు స్పీడ్ బ్రేకర్

By:  Tupaki Desk   |   17 March 2016 10:17 AM GMT
అసెంబ్లీ వాయిదాతో రోజాకు స్పీడ్ బ్రేకర్
X
అనుకున్నట్లే అయింది... కోర్టు ఉత్తర్వులతో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన రోజాను నిలువరించేందుకు పాలక టీడీపీ కొత్త ఎత్తుగడ వేసింది. న్యాయస్థానం వైపు నుంచి అడ్డుకోవడానికి సమయం చాలకపోవడంతో తాత్కాలికంగా ఈరోజుకు కథ ముగించడానికి గాను అసెంబ్లీని వాయిదా వేసింది. దీంతో ఈరోజు రోజా అసెంబ్లీ వచ్చే అవకాశం లేకుండా పోయింది. రోజా కోర్టులో గెలిచి ఆ తీర్పుతో అసెంబ్లీకి అడుగుపెట్టడానికి ప్లాన్ చేయగానే ఆమెకు ఘనస్వాగతం పలకడానికి వైసీపీ ఏర్పాట్లు కూడా చేసుకుంది. మరోవైపు ఆమెను అడ్డుకోవడానికి ప్రభుత్వం మార్షల్స్ ను మోహరించింది. ఎలాగైనా అడ్డుకోవాలని అనుకుంది. దీంతో అసెంబ్లీ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలకు దారితీసే పరిస్థితులు కనిపించడంతో పాలక పక్షం తెలివిగా శాసన సభ వాయిదా మార్గాన్ని ఎంచుకుంది.

అసెంబ్లీ వాయిదా వేయడంతో రోజాకు శాసనసభకు ఈ రోజు రావడానికి మార్గాలు మూసుకుపోయాయి. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పటికప్పుడు అంచనా వేయలేకపోయినా తాజా అంశాన్ని అడ్డం పెట్టుకునైనా సరే ఆమెను మరోసారి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎలాగైనా సరే ఏడాది సస్పెన్షన్ అమలయ్యేలా చూడాలని టీడీపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.