Begin typing your search above and press return to search.
రోజా ఆటలు అందుకేనా!
By: Tupaki Desk | 10 Nov 2021 4:30 AM GMTమొన్న కబడ్డీ.. నిన్న వాలీబాల్.. నేడు బ్యాడ్మింటన్.. ఇలా వరుసగా ఆటలాడుతూ సాగుతున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయా క్రీడల ప్రారంభోత్సవాలకు వెళ్లున్న రోజా.. పనిలో పనిగా తాను కూడా బరిలో దిగి ఆడేస్తున్నారు. ఆమె భర్తతో పాటు సోదరులు కూడా ఆటలో సై అంటున్నారు. దీంతో ఆమె ఆటలాడుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా అయ్యాయి. అయితే ఇలా టోర్నీల పేరుతో ఆమె ఆటలాడడం వెనక రెండు ప్రధాన కారణాలున్నాయనే ప్రచారం సాగుతోంది.
రెండోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమెకు ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగ సమావేశాల్లో.. పార్టీ కార్యక్రమాల్లో.. ఇటీవల పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ నాయకులే ఆమెకు ఎదురు తిరుగుతున్నారు. పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తనను ఒంటరి చేయాలనే లక్ష్యంతో వైసీపీ నాయకులు కృషి చేస్తున్నారని గతంలో రోజానే స్వయంగా ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి ఓ వైపు తన పట్టును కాపాడుకుంటూ మరోవైపు రోజాకు ఇబ్బందిగా మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ ఎన్నికల్లో రోజా సూచించిన అభ్యర్థులను కాకుండా ఇతరులను పోటీలో నిలబెట్టాలని పార్టీలోని మరో వర్గం పట్టుపట్టింది. చివరకు తన మాటనే రోజా నెగ్గించుకున్నారు. కానీ నియోజకవర్గంలో తనపై సొంత పార్టీ నేతలే సృష్టిస్తున్న వ్యతిరేకతను మాత్రం ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. అందుకే ఆమెనే స్వయంగా ఇలా ప్రజల్లోకి వెళ్లి జనాలు తనవైపే ఉండేలా చూసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు జగన్ కొత్తగా ప్రకటించే కేబినేట్‌లో రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడే రోజా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జగన్ ఆమెను శాంతింపజేసేందుకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ను చేశారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. దీంతో రోజాను మంత్రిని చేసేందుకు ఆ పదవి నుంచి జగన్ తొలగించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో రోజా ఏదో ఓ కార్యక్రమం పేరుతో ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. క్రీడా టోర్నీల్లో భాగంగా ఆటగాళ్లతో కలిసి ఆటలాడిన ఆమె.. మరో కార్యక్రమంలో భాగంగా డబ్బు కళాకారులతో కలిసి డప్పు వాయించారు. మొత్తానికి రోజా పుల్ జోష్‌లో ఉన్నారని తెలుస్తోంది.