Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను మ‌ళ్లీ ప్ర‌శంసించిన రోజా... తెలుగువారి గురించి ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   12 Feb 2022 2:30 PM GMT
కేసీఆర్ ను మ‌ళ్లీ ప్ర‌శంసించిన రోజా... తెలుగువారి గురించి ఏమ‌న్నారంటే
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారని ఆమె ప్ర‌శంసించారు. ఈ కాలంలో ఎవరికి దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌కు లభించిందన్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రిలో ప‌ర్య‌టిస్తున్న రోజే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అత్యంత సుంద‌రంగా, అద్భుతంగా నిర్మించిన దేవాల‌యంలో యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని రోజా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందని తెలిపారు.

ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని గుర్తుచేశారు. తెలుగువారు ఎప్పటికీ అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా, ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.