Begin typing your search above and press return to search.
రోజా రాజీనామా చేసి పోటీ చేస్తే గెలుస్తుందా?
By: Tupaki Desk | 23 Feb 2016 9:37 AM GMTఏపీలో వైసీపీ కెప్టెన్ లేని నౌకలా మారిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు పాలక టీడీపీలో చేరిన సమయానికి వైసీపీ అద్యక్షుడే ఢిల్లీ వెళ్లి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు జారిపోయినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దీంతో అక్కడి నుంచి ఆదేశించారో ఏమో కానీ... ఈ వ్యవహారంపై ఎట్టకేలకు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. వైసీపీ మాటల రాణి రోజా దీనిపై ఈ రోజు స్పందించారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని రోజా సవాల్ విసిరారు.
పార్టీలు మారుతున్న నాయకులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. ఎంత మందిని చేర్చుకుంటే అంత తొందరగా టీడీపీ మునిగిపోతోందని ఆమె విమర్శించారు. తెలంగాణలో చంద్రబాబుపై నమ్మకం లేకే టీఆర్ ఎస్ లోకి వెళ్లారని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. భూమా టీడీపీలో చేరడం వల్ల శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని రోజా అన్నారు.
అయితే... తెలంగాణలో చంద్రబాబుపై నమ్మకం లేకే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆరెస్ లోచేరుతున్నారన్న ఆమె ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఎందుకు చేరుతున్నారన్నది మాత్రం చెప్పలేదు. మరి ఆ లాజిక్ ప్రకారం ఇక్కడా జగన్ పై నమ్మకం లేకే చేరుతున్నారని అనుకోవాలా లేదంటే చంద్రబాబుపై నమ్మకంతో చేరుతున్నారని అనుకోవాలో రోజాయే చెప్పాలి.కాగా పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలంటున్న రోజాకు కొత్తగా టీడీపీ చేరిన ఎమ్మెల్యే గట్టి కౌంటరే ఇస్తున్నారు. మా సంగతి తరువాత నీవు ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే గెలుస్తావా అని వారు ప్రశ్నిస్తున్నారు.