Begin typing your search above and press return to search.
టీడీపీపై రోజా 'పప్పు తాలింపు' సెటైర్ పేలిందే?
By: Tupaki Desk | 5 Aug 2017 9:37 AM GMTఏపీలో అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు - ఏపీ మంత్రి నారా లోకేశ్ పై సెటైర్ల మీద సెటైర్లు వినిపిస్తున్నాయి. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు నుంచీ మాట తీరులో తడబడుతున్న నారా లోకేశ్ పై ఇప్పుటికే *పప్పు* అన్న సెటైన్ సోషల్ మీడియాలో పేలిపోయిందనే చెప్పాలి. తాజాగా ఈ పప్పు సెటైర్ కు *తాలింపు* మాటను జోడించేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సరికొత్త సెటైర్ పేల్చేశారు. ఈ సెటైర్ కూడా బాగానే పేలిపోయిందన్న వాదన వినిపిస్తోంది.
మొన్నటి నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్లను ఆధారం చేసుకుని మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి దాకా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగిపోయారు. ఈ ఆందోళనలపై నంద్యాల ప్రచారంలో ఉన్న ఆర్కే రోజా కాసేపటి క్రితం తరదైన శైలిలో స్పందించారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజా... టీడీపీ నేతలకు సూటిగానే చురకలు అంటించేశారు. టీడీపీ నిండా ‘పప్పు’ బ్యాచ్‌లు ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ఆ నాయకులంతా అమరావతిలో కూర్చొని *పప్పు* *తాలింపు* వేసుకోవడం ఆపి, పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి రాష్ట్రంలో కుటిల రాజకీయాలకు తెర తీసిన టీడీపీకి బుద్ధిచెప్పడానికి నంద్యాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
నంద్యాలతో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులకు మతిభ్రమించిందని, అందుకే అక్రమ మార్గాల్లో ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరికి డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలు ధర్నాలు చేయిస్తున్నారని ఆక్షేపించారు. *కాల్ మనీ సెక్స్ రాకెట్ - డ్వాక్రా మహిళలకు వెన్నుపోటు.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మహిళలను మోసగిస్తున్న సంగతి మంత్రి అఖిలప్రియకు తెలియదా? సంప్రదాయాల గురించి అఖిలప్రియ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. శోభానాగిరెడ్డి చనిపోయినప్పుడు కనీసం చూడటానికైనా చంద్రబాబు వచ్చారా? ఆమెకు తల్లిదండ్రుల కంటే పదవులే ముఖ్యమయ్యాయి* అని రోజా అన్నారు. రోజా తాజాగా చేసిన పప్పు తాళింపు సెటైర్ మాత్రం టీడీపీ నేతలకు మంట పుట్టించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.