Begin typing your search above and press return to search.
రోజా క్వశ్చన్!...అమరావతి భ్రమరావతేనా?
By: Tupaki Desk | 16 Sep 2017 4:48 AM GMT`ప్రపంచ స్థాయి హంగులతో రాజధానిని నిర్మిస్తా. ఇదే నా స్వప్నం` అంటూ మాటలు కోటలు దాటిస్తున్నారు సీఎం చంద్రబాబు! డిజైన్లు మారుతున్నాయి.. ఆర్కిటెక్ట్ సంస్థలు మారుతున్నాయి.. శంకుస్థాపనలు జరుగుతున్నాయి.. కానీ కలల రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రధాన భవంతుల డిజైన్లపై ఎన్నికల సమయానికైనా ఒక స్పష్టత వస్తుందో రాదో తెలియని పరిస్థితి! ఏదో చేసేస్తున్నాం.. అని ప్రజలకు అమరావతిపై భ్రమలు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన సైటైర్లు వేశారు!
చంద్రబాబుపై రోజా మరోసారి ఫైర్ అయ్యారు. రాజధానిలో ప్రధాన భవనాల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! ఈ తరుణంలో.. రోజా ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతేగాక అమరావతి నిర్మాణంపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? అమరావతి భ్రమరావతే అని ఎద్దేవా చేశారు.
పూటకో మాట - రోజుకో మీటింగ్ - వారానికో కొత్త డిజైన్ - పక్షానికో విదేశీ యాత్ర - నెలకో తాత్కాలిక భవనానికి శంకుస్థాపన అంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఇక తడకులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని - చిత్తూరు జిల్లాకు పుత్తూరు ఏమన్నా డంపింగ్ యార్డా అని రోజా ప్రశ్నించారు. ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వేస్ట్ ఎనర్జీ ఒక విఫల ప్రయోగమన్నారు. విజయవాడలో ఈ ప్రయోగం విఫలమైందన్నారు. దీని వల్ల పుత్తూరు - వడమాలపేట మండలాల్లో దోమలు - ఈగలు ఉధృతమై ప్రజలు విషజ్వరాల బారిన పడతారన్నారు.