Begin typing your search above and press return to search.
లోకేష్ ట్వీట్ల గుట్టు విప్పిన రోజా
By: Tupaki Desk | 16 Jun 2018 12:01 PM GMTకేంద్ర ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో కొత్త పల్లవి అందుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భారీ సెటైర్ వేశారు. ప్రజలను తన ప్రచారంతో మభ్యపెట్టడంలో చంద్రబాబును మించిన వారు లేరని వ్యాఖ్యానించారు. దోచుకున్న నిధులను దాచుకోవడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఆయన దీక్షలను అస్త్రంగా చేసుకున్నారని ఎంచుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యానందస్వామిలా దీక్ష డ్రామాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు కుట్రలు బుగ్గన రాజేంద్రనాథ్ విషయంలో మరోసారి నిరూపితమయ్యాయని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తానని ఎంపీ సీఎం రమేష్ చెబుతున్నారని, ఇది కేవలం పబ్లిక్ స్టంటేనని రోజా అన్నారు. కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడవద్దని లోకేష్ కు చంద్రబాబు సూచించారని - అందుకే ఆయన ట్విట్టర్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ నిర్ణయాలు తీసుకున్నదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. వారం రోజుల్లో టీటీడీ స్పందించకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. నగర నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం టీటీడీ ఈవోను కలిసినా ఫలితం శూన్యమని రోజా విమర్శించారు.