Begin typing your search above and press return to search.
పవన్ ప్రత్యేక స్టాండ్ పై రోజా సెటైర్లు
By: Tupaki Desk | 10 Sep 2016 8:26 AM GMTవైకాపా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మరోసారి పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైరయ్యారు. నిన్న కాకినాడ వేదికగా నిర్వహించిన సభపై ఆమె సెటైర్లతో కుమ్మేశారు. హోదా విషయంలో పవన్ స్టాండ్ ఎవరికీ అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ - బీజేపీలు రెండూ తమ మ్యానిఫెస్టోల్లో హోదా అంశాన్ని చేర్చయో లేదో చూడకుండానే పవన్ ఆ రెండు పార్టీలకూ మద్దతు పలికారా? అని రోజా ప్రశ్నించారు. కేవలం నాలుగు మాటలు మాట్లాడితే, అప్పుడప్పుడు వచ్చి మీటింగ్ లు పెడితే కాదని, పూర్తిస్థాయిలో వస్తే తెలుస్తుందని అన్నారు. వైకాపా సభ్యుల తీవ్ర ఆందోళనతో వరుసగా మూడో రోజూ అసెంబ్లీలో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరవధికంగా వాయిదా వేశారు .
ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైకాపా అధ్యక్షుడు జగన్ తన సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఫుట్ పాత్ పైనే కూర్చుని రోజా కూడా ఆందోళన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ సభలో పవన్ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. అవగాహనా రాహిత్యంతోనే మాట్లాడారని రోజా ఆరోపించారు. పవన్ ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఎద్దేవా చేశారు. పవన్ హోదా కోసం మోడీ - చంద్రబాబులను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పూలు పెట్టిందని ఆమె విరుచుకుపడ్డారు. టీడీపీ - బీజేపీల మేనిఫెస్టోలను చూడకుండానే పవన్ ఆ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశారా? అని ఆమె ప్రశ్నించారు. రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం. గతంలోనూ పవన్ పై రోజా కామెంట్లు విసిరారు. గబ్బర్ సింగ్ కాదు.. రబ్బర్ సింగ్ అంటూ.. విరుచుకుపడ్డారు. దీనికి తిరుపతి సభలో పవన్ రివర్స్ సైటర్లు కుమ్మేశారు. మరి ఇప్పుడు తాజా కామెంట్లపై పవర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి. జనసేన అభిమానులు మాత్రం రోజా వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేసినట్టే కనిపిస్తోంది.