Begin typing your search above and press return to search.
‘‘వైఎస్ నిజంగా మగాడే’’.. ఈ మాట అన్నది..
By: Tupaki Desk | 12 Feb 2017 4:45 AM GMTఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సమావేశానికి ఆహ్వానాలు పంపిన ఏపీ సర్కారు.. ఆ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను అదుపులోకి తీసకెళ్లిన వివాదాస్పద అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యేను అనుమానంతో అదుపులోకి తీసుకోవటం.. ఆమెకున్న గన్ మెన్ ను అనుమతించకుండా పోలీసు బలగాలతో తీసుకెళ్లిపోవటం.. ఎక్కడకు తీసుకెళుతున్నారో కూడా ముందస్తుసమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లటం లాంటివి చూస్తున్నప్పుడు ఏపీలో ప్రభుత్వం ఉందా? అన్న భావన కలగక మానదు.
నిజంగానే రోజా ఏదో చేయాలన్న ఆలోచనలో ఉందనే అనుకుందాం. అలాంటి ప్రయత్నం చేస్తే.. అడ్డుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలే కానీ.. తమకేదో సమాచారం వచ్చిందంటూ సరైన ఆధారాలు ఏమీ చూపించకుండానే అదుపులోకి తీసుకోవటం సరైన పని కాదన్న మాట వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై రోజా రియాక్ట్ అవుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. అప్పటి అధికారపక్షంలో ఉన్న వైఎస్ తన పట్ల వ్యవహరించిన వైనం గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని.. పలు సమస్యలపై ఇప్పటి మాదిరే అప్పుడూ గళం విప్పానని.. అయితే.. ఏ రోజూ వైఎస్ తనను అణగదొక్కాలని ఆలోచించలేదన్నారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా మగాడే. ఆ విషయం గట్టిగా చెప్పగలను. సమస్యలపై విమర్శలు చేస్తే.. నన్ను మహిళా నాయకురాలిగానే చూశారే కానీ.. ఈ తరహాలో వ్యవహరించలేదు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నా చేత పదేళ్లు పార్టీలో గాడిద చాకిరి చేయించుకున్నారు. గర్భిణిగా ఉండి కూడా ఎన్నికల్లో ప్రచారం చేశా. నేను ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ తరఫున ఒక్క పైసా ఇవ్వలేదు. రెడ్డి కులస్తురాలినని ఓడించిన నీచమైన బుద్ధివాళ్లది.నేనుచేసిన కష్టాన్ని కూడా గుర్తించకుండా ఓడించారు. చంద్రబాబుకు సెంటిమెంట్లు అస్సలు ఉండవు’’ అని చెప్పుకొచ్చారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున పూర్తిగా స్థాయిలో ప్రత్యర్థిపైనా విరుచుకుపడటంలో రోజా ఏమాత్రం వెనుకాడలేదని చెప్పాలి. ఈ లెక్కన రోజా.. టీడీపీలో ఉన్నప్పుడు ఆమె ఇబ్బందుల్ని తీర్చటంలో చంద్రబాబు విఫలం కావటమే కాదు.. ప్రత్యర్థిగా ఉన్న వేళ.. హుందాగా వ్యవహరించటంలోనూ బాబు తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది.