Begin typing your search above and press return to search.
లోకేష్‌ను గెలిపించుకోలేని అసమర్థుడు బాబు
By: Tupaki Desk | 27 Nov 2017 8:27 AM GMTటీడీపీ అధినేత- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు- నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు ఘాటు విమర్శలు చేశారు. ఈ దఫా ఏకంగా బాబు ఇలాకాకు వెళ్లి ఆయన గురించి సంచలనం కామెంట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రోజా గుడుపల్లి రైల్వే క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడారు. తన కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలుపించుకోలేని అసమర్ధుడు చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచలేని చంద్రబాబు తన కుమారుడిని దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకనే టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అబద్దాలు చెబుతున్నారని అన్నారు.
రుణమాఫీ-ఇంటికో ఉద్యోగం-నిరుద్యోగ భృతి-ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేసి మీ అందరికీ పెద్దకొడుకులా ఉంటూ కష్టాలను తీరుస్తానని వంటి పలు అబద్దాలు చెప్పి మాట తప్పారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంతలో కూరగాయలను కొన్నట్లు పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటూ నోటుకు ఓటు కేసులో బుక్కైన చంద్రబాబు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని రోజా దుయ్యబట్టారు. నోటుకు ఓటు కేసు నుండి బయటపడేందుకు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. రాష్ట్రంలోని తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిచేత రాజీనామా చేయించకుండానే- వారికి మంత్రి పదవులు ఇవ్వడం చూస్తుంటే చంద్రబాబు ఎంత నీచానికి దిగజారిపోయారో అర్ధమవుతోందని అన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కుప్పం ప్రజలకు రోజా హితబోధ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఒక్కరినే గెలిపించడంవల్ల కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కుప్పం ప్రజలు వేరే ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వెళ్లి చూస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం అవుతుందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కుప్పంలో వైకాపా అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.