Begin typing your search above and press return to search.

ప్రజలకు ఏ చిన్న సాయం చేయని కుటుంబం - మెగా ఫ్యామిలీ పై రోజా కామెంట్స్!

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:01 PM GMT
ప్రజలకు ఏ చిన్న సాయం చేయని కుటుంబం - మెగా ఫ్యామిలీ పై రోజా కామెంట్స్!
X
మెగా ఫ్యామిలీపై ఏపీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబును టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పై రోజా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే చిరంజీవి పై పెద్దగా స్పందించిన దాఖలాలులేవు. కానీ ఇప్పుడు ముగ్గురు మెగా బ్రదర్స్ పై రోజా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ అంత మానవత్వం లేనివాడు.. ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఒక ఆర్టిస్ట్ గా సిగ్గుపడుతున్నాను.. ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సున్నితంగా ఉంటారు. ఎమోషనల్ గా ఉంటారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ లాంటి వారు అంత స్థాయిలో ఉన్నా అన్నీ వదలుకొని తమను ఇంతవారిని చేసిన ప్రజలకు సేవ చేయాలని.. ప్రజల్లో ఉంటూ.. ప్రజల భరోసాను పొంది సీఎంగా ఎన్నికయ్యారు..కానీ ఈ మెగా కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే? వీళ్లని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు కనీసం ఇప్పటివరకూ ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాల్లో సొంత నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు’ అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్స్ ఎన్నికల్లో విజయం సాధించపోవడానికి గల కారణాలను రోజా విశ్లేషించారు.

ఇవన్నీ చూశాక అయినా వీరికి రాజకీయాల్లో భవిష్యత్ లేదని గ్రహించాలని రోజా హితవు పలికారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సరైన సందర్భంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు.. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో.. అప్పుడు నోటికి తాళం వేసుకుంటాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో.. తప్పులు చేస్తాడో అప్పుడొచ్చి ఆయనకు సపోర్టుగా మాట్లాడుతాడు. ఇదంతా చూస్తుంటే.. ప్యాకేజీ కోసం చంద్రబాబుకు ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నోడో అర్థమవుతోందని రోజా నిప్పులు చెరిగారు.

ఇప్పటంలో గోడలకు ఉన్న విలువ.. కందకూరులో చనిపోయిన ఆడవాళ్లకు.. వారి కుటుంబాలకు లేదా? అని పవన్ కళ్యాణ్ ను రోజా నేరుగా ప్రశ్నించారు. కనీసం ఎందుకు పరామర్శించలేదని రోజా నిలదీశారు. నయాపైసా సహాయం చేయలేదు. కానీ ఈరోజు జీవో నంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా? అంటూ గాయిగాయి చేస్తున్నారు. ‘మీ గొంతు ఎవరు నొక్కారయ్యా.. ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడుతావు? జగన్ మోహన్ రెడ్డి మీద విషం చిమ్మడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ ఏం ఇచ్చిన వాగ్ధానం చేయలేదో చెప్పడం లేదు?’ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రోజా అన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలపై రోజా కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. వారి రాజకీయాలను అవహేళన చేసేలా.. ప్రజల్లో గెలవలేని తనంపై ఎద్దేవా చేసేలా రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.

మెగా ఫ్యామిలీపై ఉవ్వెత్తునే లేచిన రోజా.. మరి మంత్రి కాగానే చిరంజీవిని కలిసి ఎందుకు ఆశీర్వాదం తీసుకుంది.. ఇప్పుడు ఎందుకు తిడుతోందని మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. జగన్ మెప్పు కోసం మెగా ఫ్యామిలీని తిడతావా? అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.