Begin typing your search above and press return to search.
రోజాకు జగన్ పరామర్శ
By: Tupaki Desk | 19 Dec 2015 6:28 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తాను చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా.. శనివారం అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంలో పోలీసులు అడ్డుకోవటం.. ఇదే సమయంలో రోజా కిందకు పడిపోవటం.. స్వల్ప గాయాలు కావటం తెలిసిందే.
తొలుత ఆమెను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేసి.. అనంతరం ఆమెను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోజాను అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న జగన్.. రోజా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ఎమ్మెల్యేను స్పృహతప్పి పడేలా మార్షల్స్ కొట్టటం ఏమిటంటూ నిలదీశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నియంతృత్వమా అన్న సందేహం కలుగుతుందని జగన్ వాపోయారు.
రోజా విషయంలో మార్షల్స్ తీరును జగన్ తీవ్రస్థాయిలో ఖండించారు. పోలీసుల కారణంగా స్వల్పంగా గాయపడిన రోజాను.. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఎమ్మెల్యే రోజాను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యను తప్పు పట్టారు. రోజా వద్దకు మీడియాను అనుమతించకపోవటంపై సందేహాలు వ్యక్తం చేశారు.