Begin typing your search above and press return to search.
ఐరెన్ లెగ్ అన్నోళ్లకు నా గెలుపు చెంపపెట్టు..!
By: Tupaki Desk | 24 May 2019 4:51 AM GMTమరే ప్రొఫెషన్ లో లేని రీతిలో వ్యక్తిత్వ హననం రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చింది మొదలు.. సంబంధం లేని అంశాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ రాజకీయ స్వార్థం కోసం ఎదుటోళ్ల మీద బండేయటానికి ఏ మాత్రం వెనుకాడని తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. వ్యక్తిగత విమర్శలు చేయటం ఒక ఎత్తు అయితే.. మనసు బాధ పడేలా చేసే మాటలు మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు.
తనను ఉద్దేశించి ఎన్నో ఏళ్లుగా అంటున్న ఒక మాట విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తాజాగా ప్రస్తావించారు. రాజకీయంగా ఉండే వైరంతో తనను ఉద్దేశించి ఐరెన్ లెగ్ అని పిలిచే ప్రత్యర్థి నేతలపై ఆమె మండిపడ్డారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ఆమె.. తనది ఐరెన్ లెగ్ అంటూ విమర్శించే వారికి తన విజయం చెంపపెట్టు అన్నారు.
రోజా గెలిస్తే జగన్ సీఎం కాలేరని విమర్శించిన వారందరికి నా విజయం చెంపపెట్టు. నాది గోల్డెన్ లెగ్.. నేను ప్రజల కోసం.. పార్టీ కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి గెలిచిన ఆర్కే రోజా.. తనపై అనవసర ముద్రలు వేసిన వారికి భారీ పంచ్ వేశారు. తనను గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన రోజా.. తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తనను అదే పనిగా ఐరెన్ లెగ్ అనే వారికి తన మాటలతో సరైన సమయంలో సరిగ్గా బదులిచ్చారని చెప్పక తప్పదు.