Begin typing your search above and press return to search.
పదవి ఇస్తే ఇంతటి ప్రేమా దేవుడా ?
By: Tupaki Desk | 9 July 2022 8:30 AM GMTమంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఇంతటి ప్రేమ పొంగుకు వస్తుందా అన్నది ఓ ప్రశ్న. పర్యాటక శాఖతో పాటు మరికొన్ని శాఖలు చూస్తున్న రోజా సెల్వమణి మళ్లీ మాటలతో విజృంభించారు. ప్లీనరీ వేదికగా మామూలుగా కాదు చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
కాన్ఫిడెన్స్ కు కటౌట్ లాంటి వారు జగన్ అని ఆకాశానికి ఎత్తేశారు. గనన్న ను చూస్తే.. కమిట్ మెంట్ కు కలర్స్ వేస్తే.. ఎలా ఉంటుందో అలా ఉంటారు. జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి..జగనన్న కంటెంట్ చూస్తే ప్రతిపక్షాలకు ప్యాంట్లు తడిసిపోతాయి..లాంటి మాటలెన్నో చెప్పారు.ఇవన్నీ రాజకీయంగా చేసే వ్యాఖ్యలు. పనిలో పనిగా టీడీపీని అనేశారు.
అదొక జంబలకడిపంబ పార్టీ అని., అక్కడ ఆడోళ్లు తొడలు కొడతారు..మగాళ్లు ఏడుస్తారు అంటూ పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే తన పాత గూటి పక్షులను ఏకేశారు. ఇంత చేయడం వెనుక ఏమయినా వ్యూహం ఉందా ? ఇన్ని మాటలు చెప్పడం వల్ల అధినేత దగ్గర మార్కులు ఏమయినా అదనంగా పడతాయి అని అనుకుంటున్నారా?
ఎలా చూసుకున్నా రోజా రాజకీయంగా ఎదగడం కష్టం అనే అంటున్నారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ వర్గాలకు వైసీపీ నాయకులే దగ్గరుండి సాయం చేసిన దాఖలాలు గతంలో ఉన్నాయి. అప్పటిలా నా మాటే వేదం అని జగన్ చెప్పినా కూడా కార్యకర్తలు వినేలా లేరు అని కూడా తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో పూర్తిగా రోజా హవాకు చెక్ పడింది. పుంగనూరు పెద్దాయన మాటే చెల్లింది. దీంతో అక్కడ రాజకీయాలు నువ్వా నేనా అన్న విధంగా ఉన్నాయి. ఎంత టీడీపీని తిట్టినా ప్రజలు రోజాను నెత్తిన అయితే పెట్టుకోరు.
పదవి విషయమై ఆమె సంతృప్తిగా ఉంటే ఉండవచ్చు పనితీరు కూడా ముఖ్యమే అన్న సంగతి ఆమె గుర్తు పెట్టుకుంటే మేలు.