Begin typing your search above and press return to search.
బాబు బ్యాచ్ కి ఇక.. రోజా చుక్కలేనా?
By: Tupaki Desk | 17 March 2016 7:27 AM GMTకోర్టు వ్యవహారాలకు సంబంధించి అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తగా ఉంటారని చెబుతారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన ససేమిరా అంటారని.. తొందరపడొద్దని చెబుతారన్న మాట ఉంది. అయితే.. కంట్లో నలుసులా మారి.. ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే రోజా దెబ్బకు ఏపీ అధికారపక్షం గగ్గోలు పెట్టటం తెలిసిందే. ఆమె నోటి ధాటికి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్న మాట వినిపించేది. అధికారపక్షాన్ని ఎండగట్టటంలో ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించే రోజా తీరుతో ఏపీ తమ్ముళ్లు ఉరకిరిబిక్కిరి అయ్యేవారు.
ఆమె నోటి ధాటికి అధికారపక్ష నేతలు వణికిపోయే పరిస్థితి. గత అసెంబ్లీ సమావేశాల్లోఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెపై మోషన్ ను మూవ్ చేసిన ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏమాత్రం చెల్లదని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ వాదించింది. అయితే.. వారి వాదనలో పసలేనట్లుగా బాబు బ్యాచ్ చెప్పుకొచ్చింది. న్యాయ సంబంధ వ్యవహారాల్లో బాబు అలెర్ట్ గా ఉంటారన్న పేరు నేపథ్యంలో.. రోజా విషయంలోనూ అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారని భావించారు.
అయితే.. ఆ వాదనకు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. సస్పెన్షన్ పై హైకోర్టు పూర్తిస్థాయి నిర్ణయాన్ని వెలువరించకున్నా.. ఇప్పటికైతే.. రోజాకు తాత్కాలిక ఊపశమనం లభించినట్లుగా చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఆమె అసెంబ్లీకి వెళ్లే వీలు కలుగనుంది. రోజా ఎంట్రీతో విపక్షానికి నైతిక స్థైర్యం మరింత పెరుగుతుందనటంలో సందేహంలో లేదు. తన రీఎంట్రీతో రోజా కానీ అంశాల వారీగా చెలరేగిపోతే.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. బాబు బ్యాచ్ కి రోజా చుక్కలు చూపించే అవకాశం ఉందంటున్నారు? మరి.. ఇలాంటి అంచనాలకు తగ్గట్లే రోజా తీరు ఉంటుందా? అన్నది చూడాలి.