Begin typing your search above and press return to search.
మెటా రూపకల్పనలో భారతీయుల పాత్ర ప్రత్యేకం: ఫేస్ బుక్ సీఈవో
By: Tupaki Desk | 15 Dec 2021 4:31 PM GMTఇటీవలే ఫేస్ బుక్ సంస్థ 'మెటా'గా మారింది. మాతృసంస్థ పేరును మార్చారు. ఈ మెటా కిందనే ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లు నడుస్తున్నాయి. ఈ మూడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్.
కాగా 'మెటావర్స్'ను నిర్మించడంలో భారతీయులు పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నాడు. 'మెటావర్స్' నిర్మాణంలో భాగంగా భారతీయులతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఫేస్ బుక్(మెటా) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నాడు. భవిష్యత్ ను రూపొందించడంలో భారతీయుల ప్రతిభ చాలా పెద్ద పాత్ర పోషిస్తోందని భావిస్తున్నా అని జుకర్ బర్గ్ అన్నాడు.
ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సాప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇందులోనే మరో అప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
క్రిప్టో కరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్సీలో భారీ పెట్టుబడులు పెడుతూ ప్రోత్సహిస్తున్నాయి.
ఈ బాటలో ఇప్పుడు వాట్సాప్ కూడా నడిచేందుకు సిద్ధమైంది. నోవి పేరుతో పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. ఎంపిక చేసిన యూజర్లకు నోవి బీటా వెర్షన్లకు అందిస్తుంది. నోవిలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వాలెట్ లో కరెన్సీని ఉంచాలి. ఈ డబ్బును మెటా డిజిటల్ కరెన్సీగా మారుతుంది. ఆ డిజిటల్ కరెన్సీని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించవచ్చు. నోవి డిజిటల్ క్రిప్టో కరెన్సీ వెర్షన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అందుబాటులోకి తీసుకొస్తుంది.