Begin typing your search above and press return to search.
రష్యా - ఉక్రెయిన్ వార్ లో అనూహ్య పరిణామం..ఆ దేశం మద్దతు ఇవ్వటమా?
By: Tupaki Desk | 5 March 2022 3:55 AM GMTరష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దం అంతకంతకూ ముదురుతోంది. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు చెలరేగిపోవటం.. పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సామాన్యులు సైతం మరణిస్తున్నారు. ఆస్తుల విధ్వంసం లెక్క చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. రష్యా సైన్యానికి సవాలు విసిరేలా ఉక్రెయిన్ సైనికులు చెలరేగిపోవటంతో రష్యా సైన్యానికి అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
రష్యా చేస్తున్న దాడితో ఉక్రెయిన్ కు అమెరికాతో సహా పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఇంకొన్ని దేశాలు పరోక్షంగా అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్న సూపర్ పవర్ జపాన్ రంగంలోకి దిగింది. సాధారణంగా ఆ దేశానికి ఉన్న పాలసీ ప్రకారం.. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామాగ్రిని అందజేయకూడదన్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి.. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు.. హెల్మెట్లు.. టెంట్లు.. జెనరేటర్లు.. ఆహారం.. దుస్తులు.. మందులు లాంటివి పంపుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రక్షణ సామాగ్రి పంపాలని నిర్ణయించింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం రెండు దేశాల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్.. ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. శుక్రవారం మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. రాజధాని కీవ్ లో అయితే ప్రతి పది నిమిషాలకు ఒక పేలుడు జరిగినట్లుగా చెబుతున్నారు. రాజధాని నగరాన్ని ఆక్రమించేందుకు వీలుగా రష్యా మరో 15 వేల మందికి పైగా అదనపు బలగాలతో రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
కీవ్ నగరానికి వాయువ్య ప్రాంతంలో క్షిపణి దాడులు.. యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కీవ్ తో పాటు మారిపోల్ తో పాటు ఇతర నగరాల్లోనూ రష్యా దాడులు మరింత ఎక్కువ చేసింది. ఇదిలా ఉంటే..చెర్నిహివ్.. మైకోలెయివ్ లాంటి నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్ సైన్యాలు ధీటుగా తిప్పి కొడుతున్నాయి. తమ వ్యూహంలో భాగంగా రష్యా సైన్యానికి ఆహారం.. నిత్యవసరాలు అందకుండా ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. దీంతో.. వారు యుద్ధం చేయలేని పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తోంది.