Begin typing your search above and press return to search.

హుజూర్‌ నగర్ లో బీజేపీ - టీడీపీలకి చుక్కలు చూపించిన రొట్టెల పీట

By:  Tupaki Desk   |   25 Oct 2019 9:02 AM GMT
హుజూర్‌ నగర్ లో బీజేపీ - టీడీపీలకి చుక్కలు చూపించిన రొట్టెల పీట
X
హుజూర్‌ నగర్ ఉపఎన్నికల ఫలితాలలో కారు జోరు చాలా స్పష్టంగా కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో 2018లో హుజూర్‌ నగర్ నుండి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవగా ..ఆ తరువాత అయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం తో హుజూర్‌ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీనితో అక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేసింది.టీఆర్ ఎస్ తరపున మరోసారి సైదిరెడ్డి బరిలో నిల్చున్నాడు. కాంగ్రెస్ ఈ స్థానం కాపాడుకోవాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా టిఆర్ ఎస్ విజయకేతనం ఎగురవేసింది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ... హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కొత్త రికార్డును సృష్టిస్తూ టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,358 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని నమోదు చేశారు.. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి 69,737 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 2,639 .. టీడీపీకి 1,827 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ , బీజేపీ - టీడీపీ కంటే ఇండిపెండెంట్‌ గా పోటీ చేసిన సుమన్‌ కి 2,693 ఓట్లు రావడం గమనార్హం.

ఆయనకి అన్ని ఓట్లు రావడానికి ప్రధాన కారణం రోలింగ్ పిన్ మరియు బోర్డ్ గుర్తు కారును పోలి ఉండమే అని టీఆర్ ఎస్ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా నేషనల్ పార్టీగా చెప్పుకునే బీజేపీ ... గతంలో వరుసగా అధికారం చేపట్టిన టీడీపీ కి ఒక ఇండిపెండెంట్‌ కి వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోవడం పెద్ద అవమానంగా భావించవచ్చు.