Begin typing your search above and press return to search.
ఈ రోల్స్ రాయిస్ కారును వజ్రాలతో తీర్చిదిద్దారు
By: Tupaki Desk | 27 March 2017 1:02 PM GMTఅత్యంత ఖరీదైన కార్లకు పెట్టింది పేరయిన రోల్స్ రాయిస్ తన ఖాతాలో మరో ప్రత్యేక రికార్డును నమోదు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ సంస్థ ఇటీవల జెనీవాలో జరిగిన మోటార్ షో లో వజ్రాలతో పొదిగిన కారును ప్రదర్శించింది. ఎలిగెన్స్ అనే పేరు పెట్టిన ఈ కారును దాదాపు వెయ్యి నిజమైన వజ్రాలకు చెందిన డైమండ్ల డస్ట్ తో పెయింట్ చేశారు! అది కూడా సాదా సీదా పెయింట్ వంటిది కాదండోయ్. ఈ వజ్రాల పూతను ప్రత్యేకంగా చేతితోనే రూపొందించడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకొని అందరి చూపును తనవైపు తిప్పుకొంది.
అందరినీ ఆకర్షిస్తున్న ఈ కారు పైభాగం డార్క్ గ్రే కలర్ - దిగువ భాగం లేత బూడిద రంగులో డిజైన్ చేశారు. ఈ రంగులో ఉన్నప్పటికీ కారు పై కాంతి పడినపుడు మాత్రం వజ్రపు కాంతుల మెరుపులతో మెరిసిపోతూ కార్ల ప్రియలును ఆకట్టుకుంటోంది. ఈ కారు ప్రత్యకతల గురించి రోల్స్ రాయిస్ ప్రతినిధులు వివరిస్తూ వజ్రాల కాంతి రిఫ్లెక్ట్ అయ్యేందుకు తమ బృందం ఎంతో శ్రమించిందని తెలిపారు. ప్రత్యేకంగా రెండు నెలల పాటు శ్రమించినట్లు వివరించారు. కఠినంగా ఉండే వజ్రాన్ని కారు పూతగా చేసే సమయంలో ప్రత్యేకంగా శ్రమించి నునుపు దనం తీసుకువచ్చినట్లు వివరించారు. అంతేకాదు అన్ని కార్ల లాగే నిర్వహణ సరిపోతుందని, వజ్రాల కోసం ప్రత్యేకమైన రక్షణ ఏమీ అక్కర్లేదని రోల్స్ రాయిస్ వెల్లడించింది. ఇంతకీ ఈ కారు ధర ఎంత అనేదే కదా సందేహం? ఈ వివరాలను రోల్స్ రాయిస్ వెల్లడించలేదు. ఒక ప్రత్యేకమైన కస్టమర్ కోసం దీన్ని రూపొందించినట్లు వివరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/