Begin typing your search above and press return to search.

అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్న రోల్స్ రాయిస్.. ఇకపై అలా ఉందట

By:  Tupaki Desk   |   12 Feb 2022 4:28 AM GMT
అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్న రోల్స్ రాయిస్.. ఇకపై అలా ఉందట
X
కోట్లకు కోట్లు ఉన్నప్పటికి.. కొన్నింటికి సొంతం చేసుకోవటం అంత సులువైన పని కాదు. సంపన్నులు చాలామంది ఉన్నా.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకోవటం అంత తేలికైనది కాదు.

విలాసవంతమైన కార్లను తయారు చేసే కంపెనీగా సుపరిచితమైన ఈ కంపెనీ తాజాగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. రోల్స్ రాయిస్ అన్నంతనే.. దాని ఐకానిక్ సమ్ థింగ్ స్పెషల్ మాదిరి ఉంటుంది. ఐకానిక్ చిహ్నాన్ని తాజాగా రీడిజైన్ చేయటానికి సిద్ధమైంది.

దాదాపు 111 ఏళ్ల తర్వాత తన స్పిరిట్ ఆఫ్ ఎక్ట్ససీ ఐకానిక్ మస్కట్ ను రీడిజైన్ చేయనున్నట్లుగా వెల్లడించింది. పెట్రోల్.. డీజిల్కార్ల వినియోగం తగ్గి.. ఇప్పుడన్ని కంపెనీలు ఎలక్ట్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న వేళ.. రోల్స్ రాయిస్ సైతం ఆ బాటలో నడవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తాను రూపొందించే ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో ఉండే చిహ్నాన్ని రీడిజైన్ చేయనున్నారు.

రోల్స్ రోయిస్ ఎలక్ట్రికల్ కారును స్పెక్టర్ పేరుతో సిద్ధం చేస్తున్నారు. ఈ కారుకు వినియోగించే మస్కట్ ను ఎరో డైనమిక్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఈ స్పిరిట్ ఆఫ్ ఎక్ట్స్ టీ మస్కట్ ను బ్రిటన్ కు చెందిన చార్లెస్ సైక్స్ రూపొందించారు. 111 ఏళ్ల తర్వాత తొలిసారి కొద్దిగా మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడున్న మస్కట్ డిజైన్ తో పోలిస్తే దాదాపు 17 మి.మీ. తక్కువగా ఉండేలా రూపొందించనున్నారు. కొత్త మస్కట్ 82.7 మి.మీ. పొడవుతో రానుంది. ఈ మోడల్ ను నిర్మించేందుకు విండ్ టన్నెల్ టెస్టింగ్ లో దాదాపు 830 గంటల పట్టినట్లుగా చెబుతున్నారు.

ఈ కొత్త ఐకానిక్ ను ఈవీ కార్లలో అమర్చనున్నారు. వందేళ్లకు పైనే దాటేసిన తర్వాత తొలిసారి తన ఐకానిక్ చిహ్నాన్ని మారుస్తున్న వేళ.. కొత్త ఐకానిక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.