Begin typing your search above and press return to search.

ప్రెస్టీజియస్ కంపెనీలో కూడా లేఆఫ్స్

By:  Tupaki Desk   |   22 May 2020 2:30 AM GMT
ప్రెస్టీజియస్ కంపెనీలో కూడా లేఆఫ్స్
X
కాదేది కవితకు అనర్హం అన్నట్టు.. ఇప్పుడు కాదేది ఆ మహమ్మారి తీవ్రతకు అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. కొన్ని సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించిన కంపెనీలు, పరిశ్రమలు ప్రస్తుత విపత్తుతో కుదేలు అవుతున్నాయి. ఏ రంగంలో చూసినా అదే కథ. సినిమా , మీడియా రంగాలు ఇప్పటికే కోలుకోకుండా మారాయి. ఇక ఆటోమొబైల్స్ పరిశ్రమ అసలే లేకుండా పోయింది. ఈ టైంలో కొత్త వాహనాల కొనుగోలు గురించే జనం ఆలోచించడం లేదు. మాపిటికి తిండి ఉంటే చాలు అని మాత్రమే యోచిస్తున్నారు.

విమానాల ఇంజిన్లు తయారు చేసే ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థపై కూడా తాజాగా ఈ మహమ్మారి-లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. కోట్ల విలువైన ఆ సంస్థ కూడా తాజాగా భారీగా ఉద్యోగులకు స్వస్తి పలకడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బతిన్న రోల్స్ రాయిస్ కంపెనీ.. తమ సంస్థలో పనిచేస్తున్న 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ కంపెనీకి అన్ని దేశాల్లో యూనిట్లు ఉన్నాయి. మొత్తం అన్ని దేశాల్లో కలిపి 52వేల మంది పని చేస్తున్నారు. తాజాగా ఉద్యోగులను తొలగించడం ద్వారా ఏడాదికి 856 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.6500 కోట్ల భారం తగ్గనుందని కంపెనీ తెలిపింది.