Begin typing your search above and press return to search.

ఎగిరే కార్లు వస్తున్నాయ్..త్వరపడండి

By:  Tupaki Desk   |   19 July 2018 11:15 AM GMT
ఎగిరే కార్లు వస్తున్నాయ్..త్వరపడండి
X
వాన పడితే హైదరాబాద్ రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం.. నగర ప్రజలు నరకం చూస్తున్నారు. ఇక రైళ్లలో కూడా జనాలు పెరిగిపోయారు. మరి విమానాల్లో పోదామా అంటే అదీ మరీ కాస్లీ.. మరి ఏం చేద్దాం. ఈ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఎగిరే కార్లు.. ఈ కొత్త ఐడియా ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా ట్రెండింగ్ గా వ్యాపిస్తోంది. ప్రముఖ ఉబెర్ కంపెనీ దుబాయ్ లో ఎగిరే కార్ల నెట్ వర్క్ ను ప్రారంభించాలని యోచిస్తోందట.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ కూడా ఎగిరే కారు స్టార్టప్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు ఈ ఆఫర్ ను ఇచ్చింది.

తాజాగా ఈ రేసులోకి ప్రముఖ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్ బోరో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్టిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. ఈ వెహికల్ హెలిక్యాప్టర్ తరహాలో ఆకాశంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది.ఐదుగురు ప్రయాణించేలా తీర్చిదిద్దారు. గాల్లో గంటకు 805 కిలో మీటర్ల వేగంతో.. రోడ్లపై 200 కి.మీల వేగంతో వెళ్లేలా తీర్చిదిద్దామని కంపెనీ తెలిపింది. మరో ఏడాదిలో ఈ కారు సిద్ధమవుతుందని.. 2020 నాటికి అందుబాటులోకి వస్తుందని రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ టీమ్ హెడ్ రాబ్ వాట్సాన్ తెలిపాడు. ఈ ఎగిరే కార్లు వస్తే కానీ మన ట్రాఫిక్ కష్టాలు తీరేటట్టే కనిపించడం లేదు. అయితే ధర ఎంతుంటుందనే దానిపైనే దాని వినియోగం ఆధారపడి ఉంటుంది.