Begin typing your search above and press return to search.

కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం

By:  Tupaki Desk   |   11 Jun 2022 4:36 PM GMT
కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం
X
కారు ద్వారా బీమా పొందడం సహజం కానీ ఇలా కూడా పొందవచ్చా? అని ఆశ్చర్యపోవడం ఖాయం.  ఎందుకంటే సవాలక్ష కారణాలు చెప్పి బీమా ఎగ్గొట్టే కంపెనీలున్నా ఈరోజుల్లో ప్రతీ పైసాకు అవసరంలో లెక్కకట్టి బీమా చెల్లించే సంస్థలు మరికొన్ని ఉంటాయి. కానీ అమెరికాలో ఇటీవల ఓ బీమా సంస్థ నష్టపరిహారంగా చెల్లించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన మహిళ ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. 2017లో ఓ రోజు అతడికి చెందిన కారులో ఆ మహిళ తన పార్ట్ నర్ తో శృంగారంలో పాల్గొంది. అయితే ఆ వ్యక్తికి హ్యుమన్ పాపిలోనూ వైరస్ (హెచ్ఐవీ) ఉంది. ఆ కారులో జరిగిన శృంగారం కారణంగా సదురు మహిళకు ఆ సుఖవ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి కనుక ముదిరితే క్యాన్సర్ కు కూడా దారితీసే ప్రమాదం ఉంది.

కారులో జరిగిన శృంగారం కారణంగానే తనకు ప్రమాదకర సుఖవ్యాధి సంక్రమించినందున తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకూ జరిగిన నష్టం, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని తనకు ఏకంగా రూ.77.36 కోట్లు పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

న్యాయస్థానం కారు ఇన్సూరెన్స్ కు సంబంధించి డ్యామెజెస్ అండ్ ఇంజ్యూరీస్ క్లాజ్ ఆధారంగా రూ.40.83 కోట్లు పరిహారంగా ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చారు. సదురు వ్యక్తి తనకు సుఖరోగం ఉన్న విషయం దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కారులో ఆ తప్పుకు పాల్పడినట్టు కోర్టు భావించింది. దీంతో బాధితురాలి పక్షాన నిలబడి కారులో ప్రయాణిస్తుండగా దాని యజమాని వల్ల జరిగిన ప్రమాదంగా పరిగణిస్తూ డ్యామెజెస్ అండ్ ఇంజ్యూరీస్ క్లాస్ బీమా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

ఇలాంటి చిత్రమైన డ్యామేజెస్ కు పరిహారం ఇవ్వాల్సి రావడం వల్లే కారు ఇన్సూరెన్స్ లు ఇంతగా పెరిగాయి అంటూ ఎలాన్ మస్క్ సైతం ఈ తీర్పుపై స్పందించారు.