Begin typing your search above and press return to search.

యూఎన్ అధికారి బహిరంగంగా కార్ లో సెక్స్ నా?

By:  Tupaki Desk   |   28 Jun 2020 4:01 AM GMT
యూఎన్ అధికారి బహిరంగంగా కార్ లో సెక్స్ నా?
X
నాలుగు గోడల మధ్య జరిగే శృంగారం ఇప్పుడు బయటపడుతోంది. ఎక్కడ పడితే అక్కడ మూడ్ వస్తే చాలు సిగ్గూ శరం వదిలేసి కొన్ని జంటలు శృంగార డోలికల్లో మునిగితేలుతున్నాయి. లాక్ డౌన్ వేళ క్వారంటైన్ లో ఉన్న ఓ జంట ఇంగ్లండ్ మేడ బాల్కనీలో ఇలా పట్టపగలు శృంగారం చేస్తూ వీడియోలకు దొరికేశారు.

ఇజ్రాయిల్ దేశంలోనూ ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగుచూసింది. అదీ ప్రపంచానికి పెద్దన్న లాంటి ఐక్యరాజ్యసమితికి చెందిన అధికారిక కారులోనే ఓ జంట శృంగారం చేస్తూ వీడియోలకు చిక్కింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న ఓ మహిళ.. కారు వెనుక సీట్లో ఉన్న వ్యక్తి ఒడిలో కూర్చొని శృంగారానికి పాల్పడుతుండగా వీడియోలకు చిక్కారు. ఇజ్రాయిల్ దేశంలోని బెల్ అవీవ్ నగరంలోని ఓ ప్రధాన మార్గంలో కారు కదులుతున్నప్పటికీ వీరిద్దరూ రాసలీలల్లో మునిగితేలారు. కారు నంబర్ ప్లేటు, దానిపై పైభాగాన యూఎన్ (ఐక్యరాజ్యసమితి) అనే అక్షరాలు కనిపించడంతో ఆ ప్రఖ్యాత సంస్థ పరువు పోయింది.

ఈ విషయం తెలిసి షాకైన ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్ విజన్ ఆర్గనైజేషన్(యూఎన్ టీఎస్ ఓ)కు చెందిన సిబ్బంది ఇలాంటి ఘటనకు పాల్పడడంపై ఐక్యరాజ్యసమితీ సిరియస్ అయ్యింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.