Begin typing your search above and press return to search.

2 వేల మందితో శృంగారం.. దేశ అధ్య‌క్షుడు!

By:  Tupaki Desk   |   15 March 2021 6:30 AM GMT
2 వేల మందితో శృంగారం.. దేశ అధ్య‌క్షుడు!
X
భ‌ర్త‌కి ఒక భార్య‌.. భార్య‌కు ఒక భ‌ర్త‌.. ఇదే ఈ ఆధునిక స‌మాజం ఆమోదించే దాంప‌త్య జీవితం. దాదాపు ప్ర‌పంచంలోని అంద‌రూ ఇదే సూత్రాన్ని అనుస‌రిస్తున్నారు. కొంద‌రు.. కొంత మందితో ఇల్లీగ‌ల్ అఫైర్స్ ర‌న్ చేస్తుండొచ్చు. కానీ.. అది అన‌ధికారికం. అయితే.. ప్ర‌జాజీవితంలో ఉండే నాయ‌కులు మాత్రం ఇలాంటి ప‌నుల విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా మెలుగుతుంటారు. అయితే.. ఓ దేశాధ్య‌క్షుడి శృంగార వ్య‌వ‌హారాల గురించి తెలుసుకుంటే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

ఆయ‌నే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్‌. ఈ 37 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న నియంత‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచం ఎన్నో విష‌యాలు తెలుసుకుంది. ఆ దేశంలో ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉండ‌దు. అంటే.. ప్ర‌పంచంతో అక్క‌డి వాసుల‌కు సంబంధాలు ఉండ‌వు. ఇక కేవ‌లం మూడే టీవీ ఛాన‌ళ్లు ఉంటాయి. అవి కూడా కిమ్ భ‌జ‌న చేస్తుంటాయి. అయితే.. ఇవ‌న్నీ పాత విష‌యాలు.

ఇప్పుడు లేటెస్ట్ గా.. కిమ్ రాస‌లీల విష‌యం తెలుసుకొని నివ్వెర‌పోతోంది ప్ర‌పంచం! ఈయ‌న‌కు దేశంలో ఏ అమ్మాయి న‌చ్చినా.. తీసుకొచ్చి త‌న ‘ప్లెజర్ స్క్వాడ్’లో పడేస్తారట. వీళ్లంతా కిమ్ ఎప్పుడు కోరితే.. అప్పుడు తమను తాము అర్పించుకొని అతన్ని సుఖ పెట్టాలట!

ఈ విధంగా ఆయ‌న శృంగారం కోసం ప్ర‌త్యేకంగా ఓ వ్య‌వ‌స్థ‌నే ఏర్పాటు చేశార‌ట‌. ఇందులో.. ఒక్క‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 2 వేల మంది యువ‌తుల‌ వ‌ర‌కు ఉంటార‌ట‌. వీరిలో కిమ్ ఎవ‌రు కోరితే వారు బెడ్ రూమ్ కు వ‌చ్చేయాల్సిందేన‌ట‌. కాగా.. తాను ఇలా స‌ర‌స స‌ల్లాపాల్లో మునిగిపోయే కిమ్‌.. ఇత‌రులు పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం ఏకంగా మ‌ర‌ణ‌దండ‌నే విధిస్తాడ‌ట‌.

అంతేకాదు.. ఎవ‌రైనా బైబిల్ ప‌ట్టుకున్న‌ట్టు తెలిసినా.. త‌ల తీసేస్తాడ‌ట‌. ఇవేకాకుండా.. ఈ ప్ర‌పంచం నుంచి త‌మదేశాన్ని శాశ్వ‌తంగా దూరం చేస్తున్న కిమ్‌.. రోజులు, కాలాన్ని కూడా భిన్నంగా లెక్కిస్తున్నాడ‌ట‌. ఇది ఎన్నో సంవ‌త్స‌రం అని ప్ర‌పంచంలో ఎవ‌రిని అడిగినా 2021 అని చెప్తారు. కానీ.. ఉత్త‌ర కొరియాలో ఇప్పుడు న‌డుస్తున్న‌ది 107వ సంవ‌త్స‌రం! బ‌హుశా.. త‌న తాత‌, తండ్రి కూడా దేశాధ్య‌క్షులుగా ప‌నిచేసి ఉన్నారు కాబ‌ట్టి.. వారి పాల‌నా కాలం నుంచి, కాలాన్ని లెక్కించ‌డం మొద‌లు పెట్టాడేమో అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.