Begin typing your search above and press return to search.

ఒకేసారి ముగ్గురితో శృంగారం.. ఫాంటసీ ఇష్టమా?

By:  Tupaki Desk   |   5 Sept 2020 10:00 PM IST
ఒకేసారి ముగ్గురితో శృంగారం.. ఫాంటసీ ఇష్టమా?
X
శృంగార కలలు కొందరికి విపరీతంగా వస్తాయి. కలల్లో ముగ్గురు నలుగురితో రోమాన్స్ చేస్తున్నట్టు తెగ ఎంజాయ్ చేస్తారు. వీటినే ఫాంటసీ కలలు అంటారు. ఈ ఫాంటసీలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. అందులో చాలా మంది యువత తమ ఫాంటసీ కలల గురించి వివరించారు. ఆ ఊహలను నిజం చేసుకుందామని కూడా తాపత్రయపడుతుంటారు.

అయితే ఈ ఫాంటసీలు ప్రమాదకరమని.. వాటి వల్లే కొంప కొల్లేరు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్వే ప్రకారం.. 70 నుంచి 80 శాతం మంది దంపతులు శారీరకంగా తమ జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొంటున్నప్పటికీ వారి ఊహల్లో మాత్రం ఇతరులు ఉంటున్నారట.. చాలా మంది పోర్న్ చిత్రాల్లో మాదిరిగా ఒకరి కంటే ఎక్కువమందితో శృంగారం చేయాలని కోరుకుంటారు. ముగ్గురితో శృంగారం చేయాలని ఉందని చాలా మంది చెప్పారట.. ఇంకొందరు అపరిచితులతో శృంగారం చేయాలని అనుకుంటున్నారు. సెలెబ్రెటీలతో శృంగారం చేయాలనుకునే వారు కొందరు..

దీనిపై నిపుణులు మాత్రం ఇలా ఫాంటసీల్లో విహరించడం తప్పేమీ కాదని.. కాకపోతే ప్రమాదకరమైన ఫాంటసీలను నిజం చేసుకోవాలని మాత్రం అనుకోవద్దని సూచిస్తున్నారు. దాని వల్ల సంసార జీవితం కొల్లేరవుతుందని హెచ్చరిస్తున్నారు.