Begin typing your search above and press return to search.

ఆన్లైన్ క్లాసులు.. అశ్లీల వీడియోలు !

By:  Tupaki Desk   |   3 Aug 2021 10:30 AM GMT
ఆన్లైన్ క్లాసులు.. అశ్లీల వీడియోలు !
X
కరోనా వైరస్ కారణంగా విద్యారంగం మొత్తం గత కొన్ని నెలలుగా తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో గత రెండేళ్ల నుంచి విద్యా సంస్థలు తెరుచుకోవడం లేదు. దీనితో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు ఆన్లైన్ బోధనను ప్రారంభించాయి. ప్రస్తుతం అందరు విద్యార్థులు కూడా ఇలా ఆన్లైన్ తరగతులు ద్వారానే చదువును కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇక గంటల తరబడి ఫోన్లు కంప్యూటర్ల ముందు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకప్పుడు ఫోన్లు వాడొద్దు అంటూ మందలించిన తల్లిదండ్రులే ఇక ఇప్పుడు ఆన్లైన్ తరగతుల కోసం పిల్లల చేతికి మొబైల్స్ అందిస్తున్నారు. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే.. విద్యార్దులకు ఆన్‌ లైన్‌ లో పాఠాలు చెప్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది

ఆన్‌ లైన్ క్లాస్ జ‌రుగుతుండ‌గా అశ్లీల వీడియో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో స్కూల్ యాజ‌మాన్యం ఫిర్యాదుపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పుణేలోని రాజ్‌ గురున‌గ‌ర్‌ లో ఐద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల కోసం ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వ‌హించిన ఆన్‌ లైన్ క్లాస్‌ లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అశ్లీల వీడియో స్క్రీన్ల‌పై క‌నిపించింది. ఈ వీడియోతో కూడిన ఆన్‌లైన్ క్లాస్ లింక్‌ ను పాస్‌ వ‌ర్డ్‌ తో విద్యార్ధుల‌కు షేర్ చేశారు. బ‌య‌టివ్య‌క్త‌లు ఈ లింక్‌ను ఫార్వ‌ర్డ్ చేశార‌ని తాము అనుమానిస్తున్నామ‌ని ఖేడ్ పోలీస్ ఇన్‌ స్పెక్ట‌ర్ స‌తీష్ గౌర‌వ్ తెలిపారు.

చాలామంది విద్యార్ధులు క్లాస్‌ లకు హాజరవటానికి వారి తల్లి తండ్రులు లాగిన్ అయి ల్యాప్ టాప్, ఫోన్ ఇస్తుంటారు. ఆన్‌ లైన్ క్లాస్‌ కు హాజరయ్యే యాప్ లాగిన్ అయిన వెంటనే ఈ ఘఠన జరిగింది. లాగిన్ అయిన వెంటనే స్క్రీన్ మీద పోర్న్ వీడియో కనపడేసరికి తల్లితండ్రులు షాకయ్యారు అశ్లీల వీడియో క్లిప్ ప్లే అయిన స‌మ‌యంలో ఆన్‌ లైన్ క్లాస్‌ లో 30 మంది విద్యార్ధులు ఉన్నార‌ని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని తెలిపారు. ఆన్‌‌లైన్ తరగతులలో ఇలాంటి అసందర్భ వీడియోలు ప్లే అయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి… కానీ పోర్న్ వీడియో ప్లే అవటం ప్రస్తుతం కలకలం రేపుతోంది.