Begin typing your search above and press return to search.
మోదీ కన్నా రాజీవ్‌కే అధిక గౌరవం!
By: Tupaki Desk | 3 July 2017 4:13 AM GMTఅమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి ట్రంప్ అమితమైన గౌరవ మర్యాదలు ఇచ్చారు. మోదీ నాకు నిజమైన మిత్రుడు అని స్వయంగా చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక వైట్ హౌస్ లో ప్రత్యేక విందు స్వీకరించిన తొలి ప్రధాని కూడా మోదీనే. ట్రంప్ - మోదీల ఆలింగనాలు చూసి మరే భారత ప్రధానికి ఇంత గౌరవం దక్కలేదని అంతా భావించారు.
కానీ, ప్రధాని మోదీ కన్నా ముందే మరో భారత ప్రధానికి మోదీ కన్నా అధిక గౌరవం దక్కిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ అమెరికా అధ్యక్షుడు అప్పట్లో భారత ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి స్వయంగా గొడుగు పట్టి గౌరవించారనే వార్త ఆసక్తికరంగా మారింది. దీంతో, గతంలోనే సదరు భారత ప్రధానికి అమెరికాలో అమితమైన గౌరవ మర్యాదలు దక్కాయన్న విషయం తెలుస్తోంది.
కాంగ్రెస్ విడుదల చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అమెరికాకు 40వ అధ్యక్షుడయిన రోనాల్డ్ రీగన్ ఇచ్చిన మర్యాద చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో రాజీవ్ నడుచుకుంటూ వెళుతుంటే రీగన్ గొడుకు పట్టుకుని ఆయన వెంట నడుస్తున్నారు. ఒక ఉద్యోగి గొడుగు పట్టగా తానే స్వయంగా గొడుగు పడతానని రీగన్ చెప్పి రాజీవ్ ను కారు వరకు సాగనంపారట. దీంతో, ట్రంప్, రీగన్ ల అతిథి మర్యాదలను గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికాలో పర్యటించినప్పుడు మోదీ కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా గౌరవం దక్కిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.మోదీ వల్ల భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపడ్డాయని కొందరు విశ్లేషించారు. కానీ అప్పట్లోనే రీగన్ భారత్ తమకు మిత్ర దేశమని అభిమానించారని కాంగ్రెస్ చెబుతోంది. దక్షిణాసియాలోనే భారత దేశంలాంటి దేశం లేదంటూ రీగన్ ప్రశంసించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/