Begin typing your search above and press return to search.
రికార్డుల రొనాల్డో.. ఫుట్ బాల్ జట్టంతా ఒక ఎత్తు.. అతడు ఒక ఎత్తు
By: Tupaki Desk | 25 Nov 2022 10:32 AM GMTఫుట్ బాల్, హాకీ, క్రికెట్.. 11 మంది ఆటగాళ్లు మైదానంలోకి దిగే క్రీడలు. వీటిని టీమ్ గేమ్స్ గా సంబోధిస్తారు. ఇలాంటి ఆటల్లో జట్టు సభ్యులంతా సమష్టిగా ఆడితేనే ఫలితం
మంచిగా ఉంటుంది. కానీ, ఫుట్ బాల్ లో జట్టంతా ఒక ఎత్తు.. అతడు మాత్రం ఒక ఎత్తు. మిగతా 10 మంది ఆటగాళ్లను కట్టడి చేసినా.. చేయకున్నా పర్లేదు.. అతడిని
అడ్డుకోకుంటే మాత్రం ప్రత్యర్థికి గెలుపు దూరమే. అతడికి పాస్ అందిందా..? పని పూర్తిచేయకుండా వదలడు. పది గజాల దూరం నుంచైనా గురితప్పకుండా గోల్ కొడతాడు.
అతడే పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.
నవతరంలో ఓ దిగ్గజం సరిగ్గా 20 ఏళ్లవుతుంది రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ మొదలై. కానీ, ఎక్కడా అతడి ఆట బోర్ కొట్టదు. నాలుగు ప్రపంచ కప్ లు ఆడాడు. అయినా తన స్టామినా అదే స్థాయి.
లీగ్ లలో అత్యధిక ధర పలికే రారాజు. కెరీర్ చరమాంకానికి వచ్చినా అదే పరుగు. మైదానంలో అతడిని అందుకోవాలంటే కుర్రాళ్లకైనా కష్టమే. రొనాల్డో ఫిట్ నెస్ రహస్యంపై ఓ
పుస్తకమే రాయొచ్చేమో? అందుకే.. అర్జెంటీనా స్టార్ లయోనల్ మెస్సీతో కలిపి రొనాల్డోను ఈతరం సూపర్ స్టార్ గా అభివర్ణిస్తుంటారు.
రికార్డు దాసోహం.. రొనాల్డో గురువారం తన ఖాతాలో్ ప్రపంచ రికార్డు వేసుకున్నాడు. కెరీర్ చరమాంకంలో దాదాపు చివరి ప్రపంచ కప్ ఆడుతున్న రొనాల్డో.. ఘనాతో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టాడు.
అతడికిది ఐదో వరల్డ్ కప్ కాగా.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఆడిన ప్రతి కప్ లోనూ గోల్ కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు పీలే, ఉవే
సీలర్, మిరోస్లావ్ క్లోస్, లియోనెల్ మెస్సీ నాలుగు ప్రపంచ కప్ లలో గోల్స్ కొట్టిన ఆటగాళ్లుగా ఉన్నారు.
కెప్టెన్ పోర్చుగల్ కు సాధిస్తాడా కప్? ఆటగాడిగా రొనాల్డో ఎంత గొప్పవాడైనా.. కెప్టెన్ రొనాల్డో పోర్చుగల్ జట్టుకు ప్రపంచ కప్ సాధించిపెట్టలేకపోయాడు. బహుశా చివరి కప్ ఆడుతున్న అతడు ఈసారైనా దానిని సాధిస్తాడన్న ఆశతో అభిమానులున్నారు. కాగా, రొనాల్డో ప్రపంచకప్ లో మొత్తం 8 గోల్స్ చేశాడు. 2006, 2010,2014 ప్రపంచ కప్ లలో ఒక గోల్ మాత్రమే చేసిన అతడు 2018లో నాలుగు గోల్స్ కొట్టాడు. ఒక టోర్నమెంట్‌లో అతడు కొట్టిన గోల్స్ ఇవే. మరోవైపు గురువారం ఘనాతో మ్యాచ్‌లో.. రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ 3-2 తేడాతో విజయం సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.