Begin typing your search above and press return to search.
రొనాల్డో రేప్ చేశాడు.. రూ.579 కోట్లు ఇప్పించండి!
By: Tupaki Desk | 2 May 2021 1:30 AM GMTప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని, అందుకు పరిహారంగా రూ.579 కోట్లు (56 మిలియన్ పౌండ్లు) ఇప్పించాలని మాజీ మోడల్ ఒకరు కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.. ఆమె పేరు కేథరిన్ మయోర్గా. ఈ దారుణం వల్ల తాను మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని, తనకు జరిగిన అన్యాయానికి గానూ ఈ మొత్తం చెల్లించాలని కోరిందట.
2009లో లాస్ వెగాస్ లో ఈ ఘటన జరిగిందని చెప్పిందట కేథరిన్. అప్పడు తనను కలిసి రొనాల్డో.. ఆ తర్వాతో ఓ హోటల్ కు తీసుకెళ్లి, తనపై అత్యాచారం చేసినట్టు ఆరోపిస్తోంది. అయితే.. కేథరిన్ ఇవే ఆరోపణలను అప్పట్లోనే చేయగా.. స్పందించిన రొనాల్డో ఖండించాడు కూడా. అయితే.. ఈ సమస్యను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు 2010లోనే ఆమె అంగీకరించిందని, ఇందుకుగానూ రూ.2.76 కోట్లు తీసుకునేందుకు కూడా ఒప్పుకుందని సమాచారం.
ఇప్పుడు.. రూ.579 కోట్లు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈసారి కూడా స్పందించిన రొనాల్డో.. ఇవన్నీ అబద్దాలని చెబుతున్నాడు. పదేళ్ల క్రితమే సెటిల్ చేసుకున్న ఈ అంశాన్ని మళ్లీ తిరగదోడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడట. అయితే.. అప్పుడు తనతో బలవంతంగా సెటిల్ మెంట్ చేయించారని అంటోందట కేథరిన్.
ఇప్పుడు తనకు న్యాయం చేయాలని కోర్టు మెట్లు ఎక్కిందని తెలుస్తోంది. ఇందుకోసం పదుల సంఖ్యలో సాక్షులను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. మరి, ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.