Begin typing your search above and press return to search.
రూమ్ షేరింగ్ కు యూఎస్ యూత్ కొత్త రూల్
By: Tupaki Desk | 13 Feb 2017 4:03 PM GMTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావటం సంగతేమో కానీ..అమెరికా సమాజంపై భారీ ప్రభావాన్ని చూపుతున్నారని చెప్పాలి. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా విదేశీయులపై అమెరికన్లు తీవ్ర వివక్షను ప్రదర్శించటమేకాదు.. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామంతో అమెరికా సమాజంలో ట్రంప్ అనుకూలురు.. వ్యతిరేకులన్న స్పష్టమైన విభజన రేఖ వచ్చేసింది.
ఇదెంత భారీగా ఉందంటే..ట్రంప్ అనుకూలురుతో రూమ్ షేర్ చేసుకోవటానికి కూడా అమెరికాలో ఉంటున్న యూత్ అస్సలు ఇష్టపడటం లేదట. సాధారణంగా ఇంటిని షేర్ చేసుకోవటం కోసం ఆన్ లైన్లో ప్రకటనలు ఇవ్వటం కామన్. ఈ ప్రకటనల్లో నాన్ వెజ్ వారైతే వద్దు.. బ్యాచులర్స్ అయితే వద్దని.. ఇలా రకరకాల కండీషన్స్ పెట్టేసి.. తమకు ఎలాంటి ఇబ్బంది లేని వారిని రూమ్ మేట్స్ గా ఎంపిక చేసుకునే అలవాటు కనిపిస్తుంది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంపికైన తర్వాత.. రూమ్ ను షేరింగ్ చేసుకునేందుకు ప్రకటనలు ఇస్తున్న వారు.. డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉంటున్న వారికి మాత్రం తాము రూమ్ షేరింగ్ ఇవ్వమని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. జార్జ్ టౌన్ వర్సటీలో చదువుకునే షహార్ కిరణ్ అనే అమ్మాయి ఇదే తరహాలో ఒక ప్రకటన ఇచ్చింది. తన రూమ్ ను షేర్ చేసుకోవటానికి ప్రకటన ఇచ్చిన ఆమె.. ట్రంప్ మద్దతుదారులకు తాను షేర్ ఇవ్వలేనని చెప్పేసింది. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ తరహా ప్రకటనల జోరు పెరిగినట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/