Begin typing your search above and press return to search.
తెలంగాణ పాలిటిక్సు @ కర్ణాటక భవన్
By: Tupaki Desk | 30 Oct 2017 7:06 AM GMTరేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతుండడంతో తెలంగాణ పాలిటిక్సు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మంగళవారం కాంగ్రెస్ లో చేరనున్న రేవంత్ అందుకుగాను ఢిల్లీలో తన అనుచరులతో మకాం వేయడానికి ఏపీ భవన్ ను సంప్రదించగా అక్కడ ఆయనకు గదులు దొరకలేదు. ఏపీ - తెలంగాణ భవన్ వర్గాలు రెండూ ఆయన నో వేకెన్సీ బోర్డు చూపించాయట. అయితే... రేవంత్ కాంగ్రెస్ లో చేరనుండడంతో కాంగ్రెస్ పాలిత పొరుగు రాష్ర్టం కర్ణాటక రేవంత్ కు సపోర్టుగా వచ్చి తమ భవనంలో గదులు ఇచ్చింది.
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న రేవంత్ అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రమే ఢిల్లీ వస్తున్నారు. దీంతో వారందరికీ బస ఏర్పాట్ల కోసం ఏపీ భవన్ ను సంప్రదించగా - రెండు రాష్ట్రాల అధికారులూ గదులు ఖాళీ లేవని చెప్పినట్టు సమాచారం. ఏపీ భవన్ ప్రస్తుతం రెండు భాగాలుగా ఉండగా, ఓ భాగాన్ని తెలంగాణ సర్కారు - మరో భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి. రెండు చోట్లా ఆయనకు గదులు దొరకలేదు. దీంతో ఓ కన్నడ మంత్రి విషయం తెలుసుకుని కర్ణాటక భవన్ లో 30 గదులను రేవంత్ పేరిట బుక్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ భవన్ లోనూ రేవంత్ కోసం కొన్ని గదులు బుక్ అయినట్లు తెలుస్తోంది. అందుకు ఎవరు సహకరిచారన్నది తెలియరాలేదు.
కాగా సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న కొందరు రేవంత్ అనుచరులు కర్ణాటక భవన్లో దిగారు. దీంతో అక్కడ తెలుగు సందడి కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 నిముషాలకు రాహుల్ తో రేవంత్ భేటీకి అప్పాయింట్ మెంట్ ఖరారైంది. రాహుల్ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. మొత్తానికి ఇప్పుడు కర్ణాటక భవన్ వద్ద తెలుగు రాజకీయం సాగుతోందన్నమాట.