Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో భోరుమని ఏడ్చిన మహిళా ఎంపీ

By:  Tupaki Desk   |   25 March 2022 11:59 AM GMT
పార్లమెంట్ లో భోరుమని ఏడ్చిన మహిళా ఎంపీ
X
పార్లమెంట్ సాక్షిగా మహిళా ఎంపీ బోరుమన్నారు. కన్నీరు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని భీర్ భూమ్ హింసాత్మక ఘటనపై కోల్ కతా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏప్రిల్ 7 లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

రాజ్యసభలో పశ్చిమ బెంగాల్ కు చెందిన భారతీయ జనతాపార్టీ ఎంపీ రూపా గంగూలీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా భీర్ భూమ్ హింసాకాండను తలచుకొని రూపా గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారని.. బెంగాల్ ను కాపాడాలని ఆమె సభలో కన్నీరు పెట్టుకున్నారు.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని రూపా గంగూలీ సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది సాధారణ జనం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని.. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీర్ భూమ్ లోని హింస గురించి మహిళా ఎంపీ గంగూలీ రాజ్యసభలో ప్రస్తావించారు. కేవలం 8మంది మాత్రమే మరణించారని.. అంతకన్నా ఎక్కువ లేదని ఆమె బెంగాల్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. రూపా మాట్లాడుతున్న సమయంలో తృణమూల్ ఎంపీలు సభలో ఆందోళన చేశారు.

బీర్ భూమ్ హింసలో మొదట బాధితులు చేతులు విరిచేసి అనంతరం గదిలో బంధించి కాల్చివేశారని పోస్టుమార్టంలో తేలింది. ఈ క్రమంలోనే మహిళా ఎంపీ బెంగాల్ భారతదేశంలో భాగమని.. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.