Begin typing your search above and press return to search.

శ్రీను వైట్ల - ముగిసిన కేసుకు ఇంత హ‌డావుడా?

By:  Tupaki Desk   |   28 Oct 2015 9:49 AM GMT
శ్రీను వైట్ల - ముగిసిన కేసుకు ఇంత హ‌డావుడా?
X
ప్ర‌ముఖ‌ల తిప్ప‌లు ఎంత‌లా ఉంటాయ‌న్న‌ది ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల ఫ్యామిలీ ఇష్యూ చూస్తే తెలుస్తుంది. భార్య భ‌ర్త‌ల మ‌ధ్యనున్న విభేదాల‌తో శ్రీనువైట్ల స‌తీమ‌ణి బంజారాహిల్స్ పోలీస్‌ స్టేస‌న్లో ఫిర్యాదు చేయ‌టం తెలిసిందే. మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చిన ఈ కేసుకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టకొస్తున్నాయి.

భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య‌నున్న మ‌న‌స్ప‌ర్థ‌ల విష‌యంలో పోలీస్‌ స్టేష‌న్ గుమ్మం వ‌ర‌కు శ్రీనువైట్ల స‌తీమ‌ణి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎవ‌రైనా ఎవ‌రి గురించైనా ఫిర్యాదు ఇచ్చిన త‌ర్వాత దాన్ని వెంట‌నే కేసు న‌మోదు చేయ‌రు. వివ‌రాలు సేక‌రించి.. కేసు న‌మోదు చేస్తారు. ఇక‌..భార్య‌భ‌ర్త‌ల విష‌యంలో అయితే ఆచితూచి అడుగులేస్తారు. తొంద‌ర ప‌డ‌రు. కాకుంటే.. ప్ర‌ముఖ‌ల కుటుంబాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌టం.. మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత పాపుల‌ర్ అయ్యింది.

మ‌న‌స్ప‌ర్థ‌లు తొలిగి.. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ రాజీ ప‌డినా.. మీడియాలో మాత్రం ఈ వ్య‌వ‌హారంపై లొల్లి కొన‌సాగ‌టంపై విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. భ‌ర్త‌పై ఇచ్చిన ఫిర్యాదును విత్‌ డ్రా చేసుకోవ‌టం జ‌రిగింద‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే.. మ‌న‌స్ప‌ర్థ‌ల్ని ఎక్కువ‌గా ఫోక‌స్ చేసిన మీడియా.. అనంత‌రం చోటు చేసుకున్న రాజీ ప‌రిణామాల విష‌యంపై మాత్రం పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేద‌ని చెబుతున్నారు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం శ్రీను వైట్ల భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదం పూర్తిగా రాజీ కావ‌ట‌మే కాదు.. పోలీసుల‌కు ఆమె ఇచ్చిన ఫిర్యాదు కూడా వెన‌క్కి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.